హైకోర్టులో స్వామీజీ బహిష్కరణ ప్రస్తావన

13 Jul, 2018 02:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాముడిని, సీతమ్మనీ కించపరిచిన వ్యాఖ్యలకు నిరసన చెప్పబోయిన శ్రీపీఠం అధి పతి స్వామి పరిపూర్ణానందని హైదరాబాద్‌ నగరం నుంచి బహిష్కరించడం అన్యాయమంటూ హైకోర్టు లో ప్రస్తావనకు వచ్చింది. స్వామీజీని అకారణంగా, వ్యక్తిగత హక్కులకు ఉల్లంఘన కలిగించేలా నగర బహిష్కరణ చేశారని ధర్మాసనం ఎదుట ఒక న్యాయ వాది ఆవేదన వ్యక్తం చేశారు.

గురువారం హైకోర్టు ప్రారంభం కాగానే ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ టీబీఎన్‌ రాధాకృష్ణన్, న్యాయమూర్తి జస్టిస్‌ రమేశ్‌రంగనాథన్‌లతో కూడిన ధర్మాసనం ఎదుట ఒక న్యాయవాది ఈ అంశాన్ని లేవనెత్తారు. పోలీసుల తీరు రాజ్యాం గం కల్పించినవ్యక్తి స్వేచ్ఛను హరించేలా ఉందని, స్వామీజీని అసాంఘికశక్తిగా ఎలా పరిగణిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.

యాదాద్రి వరకూ నిరసన యాత్ర నిర్వహించేందుకు పోలీసుల అనుమతి తీసుకున్నారని, తర్వాత అనుమతిని రద్దు చేశారని చెప్పా రు. స్వామీజీ పట్ల పోలీసుల తీరుపై అభ్యంతరాలుం టే వ్యాజ్యాన్ని దాఖలు చేసుకోవచ్చని, ప్రజాప్రయోజనాలున్నాయని భావిస్తే∙లేఖ రాయాలని, దానిని న్యాయమూర్తులతో కూడిన కమిటీ పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని సలహా ఇచ్చింది.  

‘హైజీన్‌ కిట్స్‌ టెండర్‌’పై హైకోర్టు స్టే
సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థినులకు పంపిణీ చేయతలపెట్టిన ‘హెల్త్‌ అండ్‌ హైజీన్‌ కిట్స్‌’కు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఈ కిట్‌ లోని వస్తువుల సరఫరా టెండర్‌ను మా యార్న్‌ అండ్‌ ఫైబర్స్‌కు కట్టబెడుతూ తెలంగాణ విద్య, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్‌   జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టు తాత్కాలిక స్టే విధించింది. పూర్తి వివరాలను తమ ముందుం చాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. 

మా యార్న్‌ అండ్‌ ఫైబర్స్‌కు కిట్ల సరఫరా కాంట్రాక్ట్‌ను అప్పగిస్తూ కార్పొరేషన్‌ తీసుకున్న నిర్ణ యాన్ని సవాలు చేస్తూ హైదరాబాద్‌కు చెందిన లైట్‌హౌస్‌ ప్రమోషన్స్‌ ప్రతినిధి కల్యాణ్‌ చక్రవర్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. బుధవారం  విచారణ జరిపిన జస్టిస్‌ ఎంఎస్‌ రామచంద్రరావు మధ్యం తర ఉత్తర్వులు జారీచేశారు. అర్హతలున్నా పిటిషనర్‌ సంస్థపై అధికారులు అనర్హత వేటు వేసి, తమకన్నా ఎక్కువ ధరకు టెండర్‌ వేసిన మా యార్న్‌ అండ్‌ ఫైబర్స్‌కు టెండర్‌ కట్టబెట్టారని పిటిషనర్‌ తరఫు న్యాయవాది రవిచందర్‌ వాదనలు వినిపించారు.

మరిన్ని వార్తలు