‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

23 Jul, 2019 14:02 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రియాలిటీ షో ‘బిగ్‌బాస్‌’ ప్రసారాలను నిలిపివేసేంత వరకు తన పోరాటం ఆగదని జర్నలిస్టు శ్వేతా రెడ్డి అన్నారు. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో నటి గాయత్రి గుప్తా, పీఓడబ్ల్యూ నాయకురాలు సంధ్యతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ.. సినిమా తరహాలో బిగ్‌బాస్‌లోనూ క్యాస్టింగ్‌ కౌచ్‌ జరుగుతోందని ఆరోపించారు. మహిళల ఆత్మాభిమానాన్ని కించపరిచేలా షోలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. తాను చేస్తున్న పోరాటానికి ఇప్పటికే పలు సంఘాల మద్దతు పలుకుతున్నట్లు తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు వి.హన్మంతరావు కూడా తన పోరాటానికి మద్దతు తెలిపారన్నారు.

సినిమా రంగంలో ఎంతో గౌరవం ఉన్న అక్కినేని నాగార్జున ఈ షోకు హోస్ట్‌గా వ్యవహరించడం సరికాదన్నారు. తమిళనాడులో రాజకీయ పార్టీ పెట్టి మార్పులు తీసుకువస్తానని ప్రకటించిన విలక్షణ నటుడు కమల్ హాసన్ కూడా తమిళ బిగ్‌బాస్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తుండటం బాధాకరమని వ్యాఖ్యానించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 24, 25 తేదీల్లో తమిళనాడుకు వస్తున్నారని, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త రాజేశ్వరి ప్రియతో ప్రధానిని కలిసి ‘బిగ్‌బాస్‌’పై వినతిపత్రం సమర్పిస్తామని శ్వేతా రెడ్డి తెలిపారు. ‘బిగ్‌బాస్‌’ను నిలిపివేయాలని కోరుతూ నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి నేతృత్వంలో హైకోర్టును ఆశ్రయించామని, దీనిపై ఈ నెల 29న విచారణ జరుగుతుందని వెల్లడించారు. (చదవండి: ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

'అటవీ అభివృద్ధికి మీవంతు సహకారం అందించాలి'

‘ఉపాధి నిధుల వినియోగంలో ముందుండాలి’

మున్సిపల్‌ చట్టం ఆమోదానికి గవర్నర్‌ బ్రేక్‌

కొడుకు స్కూల్‌కు వెళ్లడం లేదని..

ఏజెన్సీలో మావోల అలజడి

డబ్బులు ఇవ్వండి... పట్టుకోండి...

పతులా.. సతులా..!

బాల్యం.. వారికి మానని గాయం

సాయానికి వెళ్తే.. ప్రాణం పోయింది

ఉస్మానియా ఆసుపత్రిలో అరుదైన శస్త్ర చికిత్స

బర్డ్స్‌ ఫొటోగ్రఫీ అంత తేలిక కాదు..

కారు గుర్తు నాదే.. కాదు.. నాదే!

వివాహేతర  సంబంధానికి  అడ్డుగా ఉన్నాడని..

ఓలా.. లీజు గోల

పెట్రోల్‌లో నీళ్లు..

ప్రతి కుటుంబానికి రూ.పది లక్షల లబ్ధి

గ్రామాలకు అమెరికా వైద్యం

ఆస్తి కోసం నా కుమారుడు చంపేశాడు

సాయంత్రమూ సాఫ్‌

గన్నీ బ్యాగుల సేకరణకు కొత్త మార్గం

నిధులు మంజూరు చేయండి: ఎమ్మెల్యే

మండలానికో డెయిరీ పార్లర్‌

చింతమడకలో సీఎం సార్‌ మెనూ..

మంత్రి నిరంజన్‌రెడ్డికి మాతృవియోగం

సీఎం కేసీఆర్‌ పర్యటన హైలైట్స్‌!

ఉన్నారా.. లేరా? 

‘నందికొండ’కు క్వార్టర్లే అండ..!

ఉద్యోగాలు కోరుతూ వినతిపత్రాలివ్వొద్దు..

పాములకు పాలు పట్టించడం జంతుహింసే!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఘనంగా స్మిత ‘ఎ జ‌ర్నీ 1999-2019’ వేడుక‌లు

విక్రమ్ సినిమాపై బ్యాన్‌!

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ వాయిదా?

‘బిగ్‌బాస్‌’ను వదలను: శ్వేత

ఎన్టీఆర్‌కు జోడిగా అమెరికన్‌ బ్యూటీ!

కమల్‌ సినిమాలో చాన్సొచ్చింది!