జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి

13 Jan, 2017 05:05 IST|Sakshi
జిల్లా కేంద్రాల్లో వసతులు కల్పించాలి

సీఎంకు దేవేందర్‌గౌడ్‌ లేఖ
సాక్షి, హైదరాబాద్‌: కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించాలని రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్‌గౌడ్‌ గురువారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. కొత్త జిల్లాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు సమావేశం కావడానికి సరైన వసతుల్లేవ న్నారు.  పన్నుల ద్వారా సమకూరే ప్రజల సొమ్ము వారికే చెందాలని, ప్రజాదనం ప్రజల అవసరాలకే వినియోగించాలని కోరారు. అన్ని జిల్లాల్లో మౌలిక సదుపాయాలను పెంచి, ఉద్యోగులను భర్తీ చేయాలని దేవేందర్‌గౌడ్‌ కోరారు.  

మరిన్ని వార్తలు