అభివృద్ధి వైపు అడుగులు

23 Mar, 2019 11:30 IST|Sakshi
మురుగు కాల్వలను శుభ్రం చేయిస్తున్న అధికారులు

 మొదట పారిశుద్ధ్య  పనులకే ప్రాధాన్యం 

 స్వచ్ఛ తాడూరు లక్ష్యంగా  పరుగులు 

 హర్షం వ్యక్తం చేస్తున్న  గ్రామస్తులు  

సాక్షి,తాడూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలు పారిశుద్ధ్యం వైపు పరుగులు తీస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలను ప్రజలకు అందించి అవగాహన కల్పించాలన్న ఉద్దేశ్యంతో కొత్తగా ఎంపికైన సర్పంచ్‌లు ఆయా గ్రామాలలో మొదట పారిశుద్ధ్య పనుకే ప్రాధాన్యత కనబరుస్తున్నారు. ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి సహకారంతో గ్రామ పంచాయతీల్లో నూతన పాలక వర్గం మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించింది.

గ్రామాలను అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు పారిశుద్ధ్య పనులు ముఖ్యమని గుర్తించారు. ఇందుకు పాలక వర్గాల సభ్యులు గ్రామంలోని అన్ని వార్డులను తిరిగి  స్థానిక  పరిస్థితులను అధ్యాయనం చేశారు. మురుగు కాల్వలు లేకపోవడంతో సీసీరోడ్లు బురదమయం అవుతున్నాయని, ప్రజల వినతుల  మేరకు  మురుగు  కాల్వల   నిర్మాణంపై ప్రాధాన్యత పెంచారు. సీసీరోడ్లకు ఇరువైపులా  మురుగు  కాల్వ నిర్మాణం ప్రధాన లక్ష్యంగా మురుగు కాల్వల నిర్మాణాల కోసం సంబంధిత అధికారులతో ప్రతిపాదనలు తయారు చేయిస్తున్నారు. నిర్మాణలను త్వరగా చేపట్టే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్‌లు అంటున్నారు.  

చకచకా పనులు 
మండల కేంద్రంలో సర్పంచ్‌గా ఎన్నికైన అనుపటి యాదమ్మ ఆధ్వర్యంలో వార్డులోని ప్రధాన సమస్యలు గుర్తించి మంచినీటి వసతితో పాటు చేమురుగు కాల్వలు, సీసీరోడ్ల నిర్మాణం పనులు చేపట్టారు. రెండు రోజుల క్రితం జరిగిన గ్రామసభలో స్వచ్ఛ తాడూరుగా చేయాలన్న ఉద్ధేశంతో గ్రామస్తులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ముఖ్యంగా 9, 10, 11, 12వ వార్డులను నీటి సమస్యతో పాటు మురుగు కాల్వ నిర్మాణాలను చేపట్టారు. ప్రధాన రోడ్డు వరకు సీసీరోడ్డు వేయించేందుకు ప్రతిపాదనలు తయారు చేశారు. 

మరిన్ని వార్తలు