స్టాఫ్‌నర్సు కళావతిపై చర్యలు తీసుకోవాలి

17 Jul, 2018 11:23 IST|Sakshi
 ధర్నా చేస్తున్న దృశ్యం   

తల్లాడ : స్టాఫ్‌నర్సు కళావతిని సస్పెండ్‌ చేయాలని, శిశువు మృతికి  బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తల్లాడ పీహెచ్‌సీ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. మార్తిని పద్మ డెలివరీ అయిన తర్వాత శిశువు మృతి చెందటంతో ఆస్పత్రి సిబ్బందిపై బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. వారికి రైతు సంఘం, కుర్నవల్లి గ్రామస్తులు మద్దతు  తెలిపారు. శిశువు కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్‌ చేశారు.

ఈ సందర్భంగా వైద్యాధికారి లేకుండా డెలివరీ చేసిన స్టాఫ్‌ నర్సు కళావతిని సస్పెండ్‌ చేయాలన్నారు. 24 గంటలు డాక్టరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే డాక్టరు ఉండి వెళ్లటం వల్ల సమస్యలు వస్తున్నాయన్నారు.

అనంతరం డిప్యూ టీ డీఎంఅండ్‌హెచ్‌ఓ భాస్కర్‌నాయక్, డాక్టర్లు వి. రాజ్‌కుమార్, కె.శ్రీనులతో చర్చించారు. 24 గంటలు ఆస్పత్రిలో వైద్యులు ఉండేలా నివేదిక పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్య తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

కార్యక్రమంలో గుంటుపల్లి వెంకటయ్య, తమ్మిశెట్టి శ్రీను, చల్లా నాగేశ్వరరావు, గంటల వెంకటాచారి, ఐనాల రామలింగేశ్వరరావు, కందికొండ నర్సిరెడ్డి, దగ్గుల ముత్తారెడి, జక్కుల రాములు, నెర్సుల తిరుపతిరావు, ఎల్లమ్మ,  సావి త్రి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు