‘ఆన్‌లైన్‌ సినిమా టికెట్లు త్వరలో రద్దు’

21 Sep, 2019 13:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆన్‌లైన్‌ సినిమా టికెట్లను ప్రభుత్వం త్వరలో రద్దు చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. అసెంబ్లీ ఆవరణలో మీడియా ప్రతినిధులతో చిట్‌చాట్‌లో భాగంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన పలు అంశాలను తలసాని ప్రస్తావించారు. అధికారికంగా టికెట్ల అమ్మకాల కోసం ప్రభుత్వం ప్లాన్ చేస్తుందని ఆయన అన్నారు. 18 నుంచి 20 లైన్స్... 8 నుంచి 10 లైన్స్ సిట్టింగ్ ఏర్పాటు చేయబోతున్నామని, ప్రభుత్వం నుంచి టికెట్ల అమ్మకాలు చేపడితే నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు లాభపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు. ‘రేస్ కోర్స్ టాక్స్ పై స్పెషల్ డ్రైవ్ చేశాం. గతంలో లక్షల్లో కట్టేది ఇప్పుడు కోట్లలో పన్ను కడుతున్నారు. సినిమా పరిశ్రమలో ఫ్యామిలీతో సంబంధం లేకుండా టాలెంట్ ఉన్నోడే హీరో అని తలసాని  చెప్పుకొచ్చారు.

మరిన్ని వార్తలు