ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని

20 May, 2020 14:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆగష్టు నెల నాటికి గ్రేటర్‌ హైదరాబాద్‌లో 50 వేల ఇళ్లు లబ్ధిదారులకు అందిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ తెలిపారు. దసరా నాటికి లక్ష ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసి అందిస్తామన్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లపై బుధవారం మంత్రులు సమీక్ష సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి ఇన్‌స్టిట్యూట్‌లో జరిగిన ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, మల్లారెడ్డి, ప్రశాంత్‌ రెడ్డి, మహమూద్‌ అలీ, నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ప్రభుత్వ అధికారులు హజరయ్యారు. అనంతరం మంత్రి తలసాని మాట్లాడుతూ.. జీహెచ్‌ఏంసీ పరిధిలో ఇళ్లు లేని వారందరికీ ఇళ్లు ఇస్తామన్నారు. లాక్‌డౌన్‌ సమయంలో కూడా ఇళ్ల నిర్మాణాలు ఆగలేదని, శరవేగంగా రెండు పడక గదుల ఇళ్లు నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. ఇప్పటి వరకు సుమారు 10 వేల ఇళ్లను లబ్ధిదారులకు అందించామని మంత్రి తెలిపారు. (డబుల్‌ బెడ్‌రూం నిర్మాణాలపై కేటీఆర్‌ సమీక్ష)

>
మరిన్ని వార్తలు