కేసీఆర్‌ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది

2 Jun, 2020 10:58 IST|Sakshi

సాక్షి, మెదక్‌: కాళేశ్వరం ప్రాజెక్ట్‌ తెలంగాణకు మణిహారంగా మారింది. కాళేశ్వరం ద్వారా తెలంగాణ రైతులకు నీటి ఎద్దడి లేకుండా సాగు, తాగు నీటికి సరిపడా గోదావరి నీళ్లు వస్తున్నాయని మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్‌ తెలిపారు. మంగళవారం జిల్లాలో మీడియాతో మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు తెలంగాణలో బతకలేరని చెప్పిన వారు ఇప్పుడు రాష‍్ట్ర అభివృద్ధిని చూసి ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే దృఢసంకల్పంతో ముందుకెళ్తున్నారు.

రాష్ట్రంలో కరోనా ప్రభావం ఉన్న పరిస్థితుల్లో కూడా రైతులు నష్టపోకూడదని  పండించిన ప్రతిగింజ కొనుగోలు చేయడం జరిగింది. సబ్సిడీ ద్వారా చేపపిల్లలను ఇచ్చి మత్స్యకారులను, 75 శాతం సబ్సిడీ ఇచ్చి గొర్రెల కాపరులను ఆదుకుంటున్నాం. తెలంగాణ సాంస్కృతిక పండుగలను రాష్ట్ర ఆవిర్భాం తర్వాత ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేరు రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని' మంత్రి తలసాని పేర్కొన్నారు. చదవండి: తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షల వెల్లువ 

మరిన్ని వార్తలు