గోల్కొండ కోట బోనాలు

1 Jul, 2018 07:04 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌  

గోల్కొండ : గోల్కొండ కోట బోనాలను అత్యంత వైభవంగా నిర్వహించి తెలంగాణ పండుగల గొప్పదనాన్ని చాటుతామని రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. ఈ నెల 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు జరిగే శ్రీ జగదాంబిక మహంకాళి అమ్మవార్ల బోనాల ఉత్సవాల ఏర్పాట్లపై శనివారం గోల్కొండలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతి«ధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గోల్కొండ కోటలో అమలవుతున్న ప్లాస్టిక్‌ నిషేదానికి మరింత చేయూతనిచ్చేందుకు కోటకు వచ్చే భక్తులకు తాగునీరు, మట్టి గ్లాసులు, మట్టి చెంబులలో అందిస్తామని ఆయన తెలిపారు.
భక్తులు చేసుకునే వంటలకు ప్రత్యేక స్థలం కేటాయించాలని, రోడ్లకు ప్యాచ్‌వర్క్‌లు నిర్వహించాలని, డ్రైనేజీ, త్రాగునీటి పైప్‌లైన్‌లకు మరమ్మత్తులు నిర్వహించి వీధి లైట్ల నిర్వహణను సరి చేయాలని అధికారులను ఆదేశించారు. మొదటి బోనం రోజున లంగర్‌హౌస్‌ నుంచి ప్రారంభమయ్యే ఊరేగింపులో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారని, ఆ రోజు లంగర్‌హౌస్‌ నుంచి కోటకు వరకు 550 ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చే యాలన్నారు. బల్దియా కమిషనర్‌ డాక్టర్‌ జనార్ధన్‌రెడ్డి మాట్లాడుతూ... ప్లాస్టిక్‌ రహిత హైదరాబాద్‌ ఏర్పాటులో పాల్గొన్న స్వచ్ఛ బోనాలు– స్వచ్ఛ గోల్కొండ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నట్లు, ఈ కార్యక్రమం అంతర్జాతీయ ప్లాస్టిక్‌ నిషేదిత కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్నామన్నారు. జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌  భారతి హోలికేరి, జిల్లా సంయుక్త కలెక్టర్‌ శ్రీవత్సకోట, పర్యాటకశాఖ ఎండి మనోహర్‌ తదితరులు పాల్గొన్నార

 
 

మరిన్ని వార్తలు