చింతపండే ఉపాధి

8 Apr, 2018 11:33 IST|Sakshi

హవేళిఘణాపూర్‌(మెదక్‌) :  చింతపండు... నిత్యవసర వస్తువుల్లో ప్రతి రోజు ఏదో ఒక వంట(కూర)లో వాడుతుంటాం. కూరల్లో పెద్దన్న  పాత్ర పోషిస్తుంది. చింతపండుతో  గ్రామీణ ప్రాంతాల్లో ఎంతో మంది ఉపాధి పొందుతున్నారు. హవేళిఘణాపూర్‌ మండల పరిధిలోని గంగాపూర్, కూచన్‌పల్లి, రాజ్‌పేట్, కొత్తపల్లి, బూర్గుపల్లి, వాడీ, శమ్నాపూర్‌ గ్రామ ప్రజలు చింతపండును సేకరించి, దానిని కొట్టి మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఇలా చింతపండును సేకరించి కొందరు సొంతంగా ఉపాధి పొందుతున్నారు. ఈ యేడు చింతపండు బాగా కాసిందని, గింజలతో ఉన్న చింతపండు కిలో రూ.40 నుంచి 50 వరకు విక్రయించగా...గింజలు లేని చింతపండు(కొట్టింది) కిలో రూ.80 నుంచి 100 వరకు విక్రయిస్తున్నారు. 

మరిన్ని వార్తలు