యోగాకు ‘సై’ అనండి!

20 Sep, 2019 03:18 IST|Sakshi
రాజ్‌భవన్‌లో గురువారం యోగా శిబిరంలో సాధన చేస్తున్న గవర్నర్‌ తమిళి సై

గవర్నర్‌ తమిళిసై సూచన

శారీరక శ్రమకు దూరమయ్యారు

నడవడం కూడా మానేశారు 

ఫిట్‌ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చండి 

సోమాజిగూడ: ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా యోగ సాధనను చేయాలని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ అన్నారు. రాజ్‌భవన్‌ సిబ్బంది వారి కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా యోగా తరగతులను ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 5.30 నుంచి 6.30 వరకు సాంస్కృతిక భవన్‌లో ఏర్పాటు చేసిన ఈ తరగతులను గవర్నర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ సాంకేతికంగా ఎంత అభివృద్ధి చెందినా..సమాజంలో చాలా మంది శారీరక శ్రమకు దూరమయ్యారని, కనీసం నడవడం కూడా మానుకున్నారన్నారు. ప్రతిరోజూ గంటపాటు తాను యోగా సాధన చేస్తానని, దీని వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తవన్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన ఫిట్‌ ఇండియా ఉద్యమానికి బలం చేకూర్చేలా ప్రతిరో జూ అందరం యోగా చేద్దామన్నారు. తెలంగాణ లోని ప్రజలంతా యోగా ప్రాముఖ్యతను తెలుసుకోవాలని, ముఖ్యంగా యువత దీన్ని నిత్యకృత్యం చేసుకోవాలని గవర్నర్‌ పిలుపునిచ్చారు. 

రాజ్‌భవన్‌ పాఠశాలలో... 
రాజ్‌భవన్‌ ప్రభుత్వ స్కూల్లో 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న సుమారు 450 మంది విద్యార్థులకు ప్రతి శనివారం యోగా తరగతులను నిర్వహిస్తున్నట్లు గవర్నర్‌ తెలిపారు. ఫిట్నెస్‌ పై పాఠశాల విద్యార్థుల్లో అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు రాజ్‌భవన్‌ స్కూల్లో  యోగా గురువు రవికిషోర్‌ శిష్య బృందం పర్యవేక్షణలో యోగా తరగతులను ప్రారంభించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో గవ ర్నరు కార్యదర్శి కె.సురేంద్ర మోహన్, సలహాదారు ఎ.పి.వి.యన్‌.శర్మ, జాయింట్‌ సెక్రటరీ భవానీ శంకర్, డిప్యూటీ సెక్రటరీ రఘుప్రసాద్‌ తదితర 200 మంది సిబ్బంది పాల్గొన్నారు.  


 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

23 నుంచి బతుకమ్మ చీరల పంపిణీ

పద్నాలుగేళ్ల తర్వాత పలకరింపు!

జలాశయాలన్నీ నిండాయి : కేసీఆర్‌

కోడెల మృతికి  బాబే కారణం: తలసాని

భవిష్యత్తులో ఉచితంగా అవయవ మార్పిడి

కుమారుడిని లండన్‌ పంపించి వస్తూ... 

ప్రాధాన్యత రంగాల అభివృద్ధికి ప్రణాళిక

ఫీజుల నియంత్రణ.. ఓ పదేళ్ల పాత మాట

పద్మావతిని గెలిపించుకుంటాం : కోమటిరెడ్డి

క్రమబద్ధీకరణ ఒక్కటే మిగిలిపోయింది: సబిత

సింగరేణి బోనస్‌ రూ.1,00,899

ఏసీ బస్సుకన్నా మెట్రో ధర తక్కువే 

గోదారి తడారదు : కేసీఆర్‌

రాష్ట్ర ప్రతిపాదననే కేంద్రం అంగీకరించింది

రేవంత్‌... ఎందుకిలా?

ఈనాటి ముఖ్యాంశాలు

‘యురేనియంపై టీఆర్‌ఎస్‌ రెండు నాలుకల ధోరణి’

అందుకే హరీష్‌ రావును కలిశా: జగ్గారెడ్డి

రేవంత్‌పై బీజేపీ లక్ష్మణ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

యోగా చేసిన గవర్నర్‌ తమిళిసై

తెలంగాణలో కుటుంబపాలన.. కేసీఆర్‌పై రాహుల్‌ ఫైర్‌!

రూ.2 లక్షల రుణమాఫీ చేసి చూపిస్తాం

కేటీఆర్ నేను సిద్ధమే.. నువ్వూ సిద్ధమా?

‘దగ్గరుండి ప్లాన్‌ చేసింది డీఎస్పీనే’

65 స్థానాల్లో ఓకే

టీఆర్‌ఎస్‌ సర్కారును ఎండగడతాం

ఆశావాహులకు రాహుల్‌ షాక్‌

టచ్‌లో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు

ఆ వర్గాలపై దాడులు పెరుగుతున్నాయ్‌: ఉత్తమ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రికార్డు స్థాయి లొకేషన్లు

సెంట్రల్‌ జైల్లో..

నీలగిరి కొండల్లో...

యాక్షన్‌ ప్లాన్‌

గద్దలకొండ గణేశ్‌

నీ వెంటే నేనుంటా