ఎమ్మెల్యే ఊరు బాగుంది

12 Dec, 2019 03:14 IST|Sakshi
బతుకమ్మతో గవర్నర్‌ తమిళిసై. చిత్రంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి

పంచసూత్రాల అమలులో కాసులపల్లి టాప్‌ 

ప్రధాని నరేంద్ర మోదీ వల్లే యోగాకు ప్రపంచ గుర్తింపు 

పెద్దపల్లి జిల్లా పర్యటనలో గవర్నర్‌ తమిళిసై 

పెద్దపల్లి: ‘పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ఊరు పేరులోనే కాసులున్నాయి. కాసులపల్లి గ్రామం పంచసూత్రా ల అమలులో దేశానికి ఆదర్శంగా నిలుస్తోందనడంలో సందేహం లేదు’ అని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. పెద్దపల్లి జిల్లాలో బుధవారం ఆమె పర్యటించారు. పెద్దపల్లి మండలంలోని ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి స్వగ్రామం కాసులపల్లిలో ఆమె పర్యటించారు. అందంగా అలంకరించిన ప్రతి ఇంటిని ఆసక్తిగా తిలకించారు. మహిళలతో ముచ్చటించారు. ఇంటింటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంతనిర్మాణంతో పాటు వాడవాడల్లో డ్రైనేజీ ఉన్న ఏకైక గ్రామంగా కాసుల పల్లి రికార్డుకు ఎక్కిందన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను అభినందించారు. కలెక్టర్‌ శ్రీదేవసేన కృషి, పట్టుదలతోనే స్వచ్ఛ జిల్లా అవార్డు దక్కించుకున్నారని తెలిపారు. అన్ని గ్రామాలు కాసులపల్లిని ఆదర్శంగా తీసుకో వాలన్నారు. అంతకుముందు ఎన్టీపీసీ టౌన్‌షిప్‌ హాలులో నిర్వహించిన కేరళ యుద్ధ విద్య (కళరిపయట్టు)ను తిలకించారు. స్వదేశీ క్రీడలను ప్రోత్సహించాలని కోరారు. ప్రధానిమోదీ చొరవతోనే ఈ రోజు యోగాకు ప్రపంచ గుర్తింపు లభించిందన్నారు.
 
కాళేశ్వరం అద్భుతం: కాళేశ్వరం ప్రాజెక్టులోని 6వ ప్యాకేజీకి సంబంధించిన పనులను గవర్నర్‌ సందర్శించారు. నందిమేడారంలోని నంది ప్రాజెక్టు సర్జిఫూల్‌ విద్యుత్‌ పనులు, పంపుహౌస్‌ ద్వారా నీటి విడుదలను తిలకించారు. రైతులకు సాగు నీరందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతమని కితాబిచ్చారు. రైతులకు ఉపయోగపడేలా సాగునీటి ప్రాజెక్టు తక్కువ సమ యంలో పూర్తి కావడం అభినందనీయమన్నారు. కాళేశ్వ రం ప్రాజెక్టు ప్రయోజనాలను ఈఎన్‌సీ వెంకటేశ్వర్లు గవర్నర్‌కు వివరించారు.  

మరిన్ని వార్తలు