పౌరసత్వ బిల్లుతో అనిశ్చితి: తపన్‌సేన్‌

16 Dec, 2019 03:19 IST|Sakshi

మల్లాపూర్‌: దేశ విభజన దిశగా బీజేపీ ప్రభుత్వం పౌరసత్వ సవరణ బిల్లును తీసుకువచ్చిందని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ ఆరోపించారు. ఈ బిల్లు వల్ల దేశంలో అనిశ్చితి వాతావరణం నెలకొందని మండిపడ్డారు. సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర మూడవ మహాసభలు ఆదివారం మల్లాపూర్‌ వీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తపన్‌సేన్‌ మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం సమాజాన్ని, దేశాన్ని విభజించే దిశగా అడుగులు వేస్తోందని విమర్శించారు. కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు సహా పలు విషయాల్లో ఒంటెత్తు పోకడలకు పోయి దేశాన్ని విభజించేందుకు ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్‌ కె.నాగేశ్వర్‌రావు, చుక్కా రాములు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా