టార్గెట్‌–2020!

14 Nov, 2018 18:52 IST|Sakshi
మాట్లాడుతున్న ఈడీ రవీంద్ర 

దక్షిణ భారతంలో రామగుండం అతిపెద్ద ప్రాజెక్టు 

తెలంగాణ వెలుగుల కోసమే వడివడిగా నిర్మాణం

ఎన్టీపీసీ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవీంద్ర

గోదావరిఖని/జ్యోతినగర్‌(రామగుండం):  దక్షణ భారతదేశంలో విద్యుత్‌ ఉత్పత్తి చేసే అతిపెద్ద సంస్థ రామగుండం ఎన్టీపీసీ అని.. తెలంగాణ రాష్ట్రానికి వెలుగులు అందించడం కోసమే వడవడిగా నూతన ప్రాజెక్టు నిర్మాణపు పనులు కొనసాగుతున్నాయని ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రవీంద్ర అన్నారు. సంస్థ 40వ ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా రామగుండం ఎన్టీపీసీ టెంపరరీ టౌన్‌షిప్‌లోని మిలీనియం హాలులో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. 

సంస్థ 52,946 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ అగ్రభాగాన నిలిచిందన్నారు. భారతావనికి 22.74 శాతం విద్యుత్‌ను అందిస్తున్న సంస్థగా చెప్పుకోవడానికి గర్వంగా ఉందన్నారు. రామగుండం ప్రాజెక్టు 1978లో శంకుస్థాపన కాగా 1983లో విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభించిదని వెల్లడించారు. దినదినాభివృద్ధి చెందుతూ తెలంగాణలో అతిపెద్ద వెలుగుల కేంద్రంగా నిలిచిందని అన్నారు. రూ.10598.98 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న తెలంగాణ స్టేజీ నిర్మాణపు పనులు ప్రమాదరహితంగా కొనసాగుతున్నాయని ప్రకటించారు. 

తెలంగాణ ప్రాజెక్టు నిర్మాణం..
తెలంగాణ సూపర్‌ థర్మల్‌ పవర్‌ ప్రాజెక్టు స్టేజీ–1లో నిర్మాణంలో యూనిట్‌–1 టర్బైన్‌ జనరేటర్‌ 18 మీటర్లు. చిమ్నీ నిర్మాణం 180 మీటర్లు పూర్తయిందన్నారు. ఇంకా చాలా పనులు కొనసాగుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో బాయిలర్‌ సీలింగ్, బాయిలర్‌ ప్రెజర్‌ పార్ట్స్, టర్భైన్‌ జనరేటర్‌ యూనిట్‌–2 పనులు, బూడిద పైపులైన్‌ పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా జూన్‌–2019లో స్టీమ్‌ బాయిలింగ్‌ విధానం ప్రారంభం కానుందన్నారు. 

యూనిట్‌–1, మే–2020, యూనిట్‌–2, నవంబర్‌–2020న విద్యుత్‌ ఉత్పత్తి దశలోకి తీసుకువచ్చేందుకు అధికారులు, ఉద్యోగులు, కార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని ప్రకటించారు. సమావేశంలో జనరల్‌ మేనేజర్లు అరవింద్‌కుమార్‌ జైన్, పుష్ఫేందర్‌ కుమార్‌ లాఢ్, డాక్టర్‌ సశ్మితా డ్యాష్, శ్రీరామారావు, సౌమేంద్రదాస్, ఉమాకాంత్‌ గోఖలే, విజయ్‌సింగ్, యం.ఎస్‌.రమేష్, సీఎస్సార్‌ మేనేజర్‌ జీవన్‌రాజు, ఉద్యోగ వికాస కేంద్రం మేనేజర్‌ ప్రవీణ్‌కుమార్, పీఆర్‌వో సహదేవ్‌సేథీ, విష్ణువర్ధన్‌ రావుతో పాటు పలువురు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు