పారిశ్రామిక రాష్ట్రమే లక్ష్యం

31 Mar, 2015 02:02 IST|Sakshi
పారిశ్రామిక రాష్ట్రమే లక్ష్యం

దుబాయ్ పెట్టుబడిదారుల వార్షిక సమావేశంలో మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: పారిశ్రామికంగా విజయవంతమైన రాష్ట్రంగా తెలంగాణను అభివృద్ధి చేయడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి  కృష్ణారావు అన్నారు. దుబాయ్‌లో ప్రారంభమైన పెట్టుబడిదారుల వార్షిక సమావేశానికి మంత్రి జూపల్లితోపాటుఅధికారులు హాజరయ్యారు. యూఏఈ ఆర్థిక మంత్రి సుల్తాన్ బిన్ సయీద్ అల్ మన్సూరీతో జూపల్లి ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను, రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక విధానాన్ని యూఏఈ మంత్రికి జూపల్లి వివరించారు. బోస్టన్‌లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రవి రామ్మూర్తి, ప్యూర్ గోల్డ్ గ్రూప్ చైర్మన్ ఫిరోజ్ మర్చంట్, వార్కే గ్రూప్ డెరైక్టర్ సి.ఎన్. రాధాకృష్ణ, కిమోహా గ్రూప్ ఎండీ వినేశ్ భిమానితో కూడా జూపల్లి సమావేశమై పెట్టుబడులను ఆహ్వానించారు.

మరిన్ని వార్తలు