లక్ష స్టార్టప్‌ల లక్ష్యం!

25 Dec, 2016 02:04 IST|Sakshi

2025 కల్లా ప్రారంభించే లక్ష్యంతో చర్యలు
అందుబాటులోకి ఏఐసీటీఈ స్టార్టప్‌ పాలసీ
స్టార్టప్‌ పాలసీకి అనుగుణంగా కరిక్యులమ్‌లో మార్పులు
తమ పరిధిలోని కాలేజీల్లో అమలుకు కసరత్తు  


సాక్షి, హైదరాబాద్‌: సాంకేతిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులతో 2025 నాటికి లక్ష స్టార్టప్‌లను ఏర్పాటు చేయించడంతోపాటు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిం చాలని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నిర్ణయించింది. జాతీ య స్టార్టప్‌ పాలసీని ఆదర్శంగా తీసుకొని సాంకేతిక రంగంలో స్టార్టప్‌లను అందుబాటు లోకి తెచ్చే కసరత్తు ప్రారంభించింది. ఇందు కోసం రూపొందించిన స్టార్టప్‌ పాలసీ ఏఐసీ టీఈ–2016ను అందుబాటులోకి తెచ్చింది. పాలసీ విధివిధానాల్ని వెబ్‌సైట్‌లో ఉంచింది.

ఏఐసీటీఈ స్టార్టప్‌ పాలసీ ఎందుకంటే...
సాంకేతిక విద్యను పూర్తి చేసుకొని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా స్టార్టప్‌ కంపెనీలను ప్రారంభించాల్సిన యావరేజ్‌ వయస్సు 32 ఏళ్లు. కానీ దేశంలో కొత్తగా స్టార్టప్‌ కంపెనీ లను ప్రారంభిస్తున్న వారు  13 శాతమే. ఈ విషయాన్ని నాస్కామ్‌ నివేదికలే వెల్లడిస్తు న్నాయి. మిగతా స్టార్టప్‌లను ప్రారంభిస్తున్నది ఇప్పటికే ఉన్న ఎంఎన్‌సీలు, కంపెనీలే. అందుకే విద్యార్థులే సొంతంగా స్టార్టప్‌లను ప్రారంభించేలా ఏఐసీటీఈ చర్యలకు సిద్ధమైంది.

కాలేజీల్లో ఏం చేయాలంటే..
విద్యార్థులే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా, ఆ దిశగా వారు ఆలోచించేలా కాలేజీల్లో బోధన కొనసాగించాలి. స్టార్టప్‌లే లక్ష్యంగా కరిక్యులమ్, పెడగాజీలో మార్పులు తీసుకు రావాలి. విద్యార్థులు ప్రారంభించే స్టార్టప్‌లు మార్కెట్‌లో నిలదొక్కుకునేలా చేయాలి.

పాలసీ ఎవరి ఆధ్వర్యంలో అమలు చేస్తారంటే..
దేశ వ్యాప్తంగా స్టార్టప్‌ పాలసీని అమలు చేసేందుకు నేషనల్‌ రిసోర్స్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ (ఎన్‌ఆర్‌ఐ)ను గుర్తిస్తారు. 4 ప్రధాన రంగాల్లో అనుభవం, విశేష కృషి చేస్తున్న సంస్థలను ఎన్‌ఆర్‌ఐలుగా గుర్తిస్తారు. అందులో ఔత్సా హిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న వాటిని పరిగణనలోకి తీసుకుం టారు. అలాగే ఏఐసీటీఈ గుర్తింపు పొందిన కోర్సులను కనీసంగా ఐదేళ్లుగా నిర్వహిస్తున్న సంస్థలై ఉండాలి. విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్డడంలో, స్టార్టప్‌లను ప్రారంభింపజేయడంలో అను భవం కలిగి ఉండి, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందినవి అయి ఉండాలి. ప్రభుత్వానికి నోడల్‌ ఏజెన్సీగా పని చేస్తున్నవి లేదా ప్రభుత్వ ప్రాజెక్టులను చేస్తున్నవి అయి ఉండాలి. పాఠ్యాంశాలు జ్ఞానం, నైపుణ్యాలు, ప్రవర్తన ఆధారిత సిలబస్‌లు ఉండాలి. విద్యార్థులను ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేలా కోర్సులు ఉండాలి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా