శాంతిభద్రతలు కాపాడుతా..

18 Nov, 2014 02:46 IST|Sakshi

ఆదిలాబాద్ క్రైం : జిల్లాలో ఘర్షణలు జరగకుండా ప్రత్యేక దృష్టి పెడతామని, శాంతిభద్రతలు కాపాడేందుకు కృషి చేస్తామని ఎస్పీ తరుణ్‌జోషి పేర్కొన్నారు. నిజామాబాద్ ఎస్పీగా పనిచేసిన ఈయన ఇటీవలే ఆదిలాబాద్‌కు బదిలీ అయ్యారు. సోమవారం తరుణ్‌జోషి జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ముందుగా పోలీసుల గౌరవ వంద నం స్వీకరించారు. బదిలీపై వెళ్తున్న గజరావు భూపా ల్ పుష్పగుచ్చం అందజేసి కొత్త ఎస్పీకి స్వాగతం పలికారు.

అనంతరం విలేకరుల సమావేశంలో ఎస్పీ తరుణ్ జోషి మాట్లాడుతూ.. జిల్లాలో అల్లర్లు సృష్టిం చే వారిపై ప్రత్యేక నిఘా పెడుతామన్నారు. మావోయిస్టుల ప్రబల్యం తగ్గించేందు కు, మతఘర్షణలను నివారించేందుకు అంతర్రాష్ట్ర కార్యకలాపాలపై ప్ర త్యేక చర్యలు తీసుకుంటామన్నారు. పోలీసు వ్యవస్థకు ప్రజల సహకారం తప్పనిసరని పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన సేవలందించడంలో పోలీసు శాఖ కీలక ప్రాత పోషించేలా చూస్తానన్నారు. త్వర లో జిల్లాలోని అన్ని పోలీసుస్టేషన్‌లను సందర్శించి పరిస్థితులు తెలుసుకుంటానని వివరించారు.

అనంతరం బదిలీపై వెళ్తున్న గజరావు భూపాల్ మాట్లాడుతూ.. ఆదిలాబాద్‌లో పనిచేయడం గొప్పగా భా విస్తున్నానని పేర్కొన్నారు. జిల్లా భౌగోళికంగా పెద్ద ది కావడంతో ఎవైనా అనుకోని సంఘటనలు జరిగి నప్పుడు సమయానికి వెళ్లలేని పరిస్థితి ఉండేదన్నా రు. ఇక్కడి ప్రజల సహకారం మరువలేనిదన్నారు. ఒకేసారి నాలుగు ఎన్నికలు వచ్చినా సమర్థవంతం గా నిర్వర్తించడం సంతోషంగా ఉందన్నారు. అనంతరం ఎస్పీ తరుణ్ జోషికి పోలీసు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ జగన్మోహన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు