యమ టేస్టీ గురూ..

15 Mar, 2019 15:50 IST|Sakshi
జనగామ పట్టణంలో కేజీల లెక్కన బెల్లాన్ని అమ్మతున్న తమిళనాడు వాసులు

సాక్షి, జనగాం: తమిళనాడు నుంచి వ్యాపార నిమిత్తం వచ్చిన గణేష్‌ బృందం సభ్యులు తాటిబెల్లం విశిష్టతను తెలుపుతూ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. తాటిబెల్లం వల్ల శరీరంలోని వేడిని, వాతం, దగ్గును తొలగించడమే కాకుండా షుగర్‌ ఉన్నవారికి సైతం ఉపయోగపడేలా లవంగం, అల్లం, మిరియాలు, దనియాలు తాటిపానీయంలో కలిపి అచ్చుపోసి బట్టికి వేస్తారు. ఈ బెల్లాన్ని మందుల తయారీకి ఉపయోగిస్తారు. దీని ధర కిలో రూ.200. పెద్ద గడ్డల ధర కిలో రూ.150 పలుకుతోంది. తాటిబెల్లం బాగా టెస్టీగా ఉండడంతో పట్టణవాసులు పెద్దఎత్తున కొనుగోలుకు ఆసక్తి కనబర్చుతున్నారు. 


విక్రయానికి సిద్ధం చేసిన తాటిబెల్లం


 సాదా తాటిబెల్లం 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా