వీడియో, ఆడియోల ద్వారా విస్తృత అవగాహన

29 Apr, 2020 19:03 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌-19 వ్యాప్తిని అరికట్టేందుకు భారత ప్రభుత్వం సూచించిన ఆరోగ్య విధానాలను ప్రజలు పాటించేలా వారిని ప్రోత్సహించేందుకు టాటా ట్రస్ట్స్‌ వారు అవగాహన చర్యలు ప్రారంభించారు. ఇందుకోసం టాటా వారు కమ్యూనిటీ ఔట్రీచ్ కార్యక్రమాన్ని మార్చి31న ప్రారంభించింది. దీని ద్వారా గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఆరోగ్య విధానాల పట్ల వారిని విద్యావంతులను చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కాగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయిలో కరోనా వైరస్‌పై అవగాహన కల్పిస్తున్నఈ కార్యక్రమాన్ని ప్రజలకు చేరువ చేసేందుకు వివిధ ఆడియో, వీడియో, యానిమేషన్‌ల ద్వారా ప్రచార చర్యలు చేపట్టింది. ప్రజలకు అవగాహన కల్పించే క్రమంలో ఆసక్తి కలిగిన సంస్థలకు 300లకుపైగా వీడియోలు, ఆడియోల ద్వారా సందేశాలను సోషల్‌ మీడియాలో అందుబాటులో ఉంచినట్టు టాటా ట్రస్ట్స్‌ ఒక ప్రకటనలో పేర్కొంది. ఇవి తెలుగు సహా పలు భాషలలో కూడా అందుబాటులో ఉన్నాయి. అంతేగాక ఇవి ప్లేలిస్టులో కూడా అభ్యమవుతున్నాయి. (జైలులో కరోనా కలకలం.. 9 మంది మృతి)

ఈ కార్యక్రమాన్ని ‘కదం, కరోనా ముక్త్‌ జీవన్‌’ పేరుతో వీడిమో సందేశాలు, లఘు యానిమేషన్‌ వీడియోలతో పాటు ఇన్ఫో గ్రాఫిక్స్‌ మొదలైన ఆడియో సందేశాలు, ఎస్‌ఎంఎస్‌ ఆధారిత సందేశాల ద్వారా అందుబాటులో ఉంచినట్టు ఆ ప్రకటనలో పేర్కొంది. అంతేగాక వీరికి మద్దతుగా సుప్రసిద్ద గాయకులు రఘు కుంచే, పార్థసారథి నేమానీలు కూడా వీడియో ద్వారా సామాజిక దూరం పట్ల, శుభ్రత పట్ల తమ సందేశాన్ని అందించారు. కరోనాపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేసేందుకు టాటా ట్రస్ట్స్‌ వారే ఇప్పుడు నలుగురు మాస్టర్‌ ట్రైనర్లను నియమించింది. వీరు 50పైగా కమ్యూనిటీ రిసోర్స్‌ పర్సన్స్‌(గ్రామ వాలంటీర్ల)కు శిక్షణ అందించడం ద్వారా ఈ సందేశం చివరి వరకూ చేరేలా వినూత్నంగా ప్రయత్నం చేస్తున్నారు. ట్రస్ట్‌ కార్యక్రమాలకు సంబంధించి ప్రస్తుత నెట్‌వర్క్‌తో పాటుగా, ట్రస్ట్స్‌ వాలంటీర్లు, భాగస్వామ్య సంస్థలు, కమ్యూనిటీ రెడియోలు, గ్రామ అధారిత పబ్లిక్‌ అడ్రస్‌ సిస్టమ్స్‌, ఇంటర్నేట్‌, కమ్యూనికేషన్‌ సాంకేతికతల వినియోగం ద్వారా ప్రజలలో అవగాహన కల్పిస్తున్నారు. 

ఈ కార్యక్రమం ద్వారా ప్రచారం చేయబడుతున్న ఆరోగ్య విధానాలు:

  1. చేతులు శుభ్రంగా కడగడంలో నైపుణ్యం.
  2. భౌతిక దూరం అవశ్యకత.
  3. శ్వాస సంబంధిత పద్ధతులు.
  4. సరైన సమాచారంపై ఆధారపడటం.
  5. కోవిడ్‌-19 లక్షణాలను ముందుగా గుర్తించడం.
  6. తిరిగి వచ​ఇన వలస కార్మికులు స్వీయ నిర్భందం కోసం మార్గదర్శకాలను అనుసరించేలా చేయడం.
మరిన్ని వార్తలు