‘నామా’ను గెలిపించాలని ప్రచారం

4 Apr, 2019 17:27 IST|Sakshi
సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ప్రచారంలో పాల్గొన్న టీబీజీకేఎస్‌ నాయకులు, ప్రచారం చేస్తున్న జలగం వెంకట్రావు  

టీబీజీకేఎస్‌ ప్రచారం 

సాక్షి, సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఖమ్మం పార్లమెంట్‌ అభ్యర్థి నామా నాగేశ్వరరావు విజయాన్ని కాంక్షిస్తూ టీబీజీకేఎస్‌ ఆధ్వర్యంలో బుధవారం సింగరేణి కొత్తగూడెం ఏరియా వర్క్‌షాప్‌ వద్ద ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కారు గుర్తుపై ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని, సింగరేణి కార్మికులకు విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సింగరేణి కార్మికులకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని కొనియాడారు. సింగరేణికి మరింత భవిష్యత్‌ చేకూరాలంటే టీఆర్‌ఎస్‌ను గెలిపించాల్సిన బాధ్యత కార్మికవర్గంపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏరియా వైస్‌ ప్రెసిడెంట్‌ ఎం.ఎ.రజాక్, రీజనల్‌ కార్యదర్శి కూసన వీరభద్రం, లెవెన్‌మెన్‌ కమిటీ మెంబర్‌ కాపు కృష్ణ, సెంట్రల్‌ కౌన్సిల్‌ మెంబర్‌లు పొదిల శ్రీనివాసరావు, విప్లవరెడ్డి, పిట్‌ సెక్రటరీ ఎండీ.సత్తార్‌పాషా, వాసు, శంకర్, పద్మ  పాల్గొన్నారు. 


నామా, వనమాతో అభివృద్ధి సాధ్యం 
పాల్వంచరూరల్‌:  టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా విజయాన్ని కాంక్షిస్తూ బుధవారం మండల పరిధి పాండురంగాపురం, సూరారంలో నాయకులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓటర్లను కలిసి నామాను గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా సొసైటీ అధ్యక్షుడు కొత్వాల శ్రీనివాసరావు మాటాడుతూ నామాను గెలిపిస్తే ఇటు ఎంపీ, అటు ఎమ్మెల్యే వనమా ద్వారా నియోజకవర్గంలో అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. గురువారం ఖమ్మంలో జరిగే సీఎం కేసీఆర్‌  బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లు జగదీష్‌కుమార్, రాణి, జి.రాంబాబు, రవీందర్, నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వర్లు, బొందిల హరి, లక్ష్మీనర్సయ్య, నాగిరెడ్డి, లక్ష్మారెడ్డి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి: జలగం  
పాల్వంచ: టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు గెలుపు కోరుతూ మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావ్‌ బుధవారం పట్టణంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీపీఎస్‌ అంబేడ్కర్‌ సెంటర్‌లో అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేటీపీఎస్‌ ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేసి నామా గెలుపునకు సహకరించాలని కోరారు. టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు బిక్కసాని నాగేశ్వరరావు సీతారామిరెడ్డి, సురేష్‌బాబు, బుడగం రవి, నల్లమల్ల సత్యం, బిల్లా సృజిత్, అయితా గంగాధర్, జనార్దన్‌రెడ్డి,  వెంకటేశ్వర్లు, బాషా, పోతురాజు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఐదో వార్డులో పొనిశెట్టి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు. నామా నాగేశ్వరరావుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు.  

మరిన్ని వార్తలు