‘దేశం’ సారథిగా ప్రకాశ్‌గౌడ్

23 Apr, 2015 23:54 IST|Sakshi

సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి : తెలుగుదేశం పార్టీ జిల్లా పగ్గాలను రాజేంద్రనగర్ ఎమ్మెల్యే  ప్రకాశ్‌గౌడ్‌కు అప్పగించారు. పార్టీ సారథిగా వ్యవహరిస్తున్న మంచిరెడ్డి కిషన్‌రెడ్డి టీఆర్‌ఎస్ గూటికి చేరుతున్న సంగతి తెలిసిందే. దీంతో పార్టీ అధ్యక్షుడిగా ప్రకాశ్  పేరును ఖరారు చేస్తూ టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది.

మహబూబ్‌నగర్‌లో గురువారం జరిగిన టీడీపీ ప్రతినిధుల సమావేశంలో పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ప్రకాశ్‌గౌడ్ పేరును ప్రకటించారు. మహేశ్వరం అసెంబ్లీ నియోజకవర్గం ఇన్‌చార్జిగా తూళ్ల వీరేందర్‌గౌడ్ పేరు ఖరారు చేశారు. అదేవిధంగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య సూచన మేరకు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా సామ రంగారెడ్డిని నియమించారు.

మరిన్ని వార్తలు