కేసీఆర్‌ది అసమర్థ పాలన

15 Nov, 2014 03:03 IST|Sakshi
కేసీఆర్‌ది అసమర్థ పాలన

టీడీఎల్పీ నేత
ఎర్రబెల్లి దయాకర్‌రావు
ఎమ్మెల్యేల సస్పెన్షన్‌కు నిరసనగా జనగామలో ధర్నా
ఎర్రబెల్లిని అరెస్ట్ చేసిన పోలీసులు

 
జనగామ : సీఎం కేసీఆర్‌ది తుగ్లక్ పాలన.. హిట్లర్ పాలన.. కుటుంబపాలన.. బంధువుల రాజ్యం అం టూ టీడీఎల్పీ నేత, పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అసెం బ్లీలో టీడీపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ను నిరసిస్తూ జనగామ ఆర్టీసీ చౌరస్తాలో టీడీపీ ఆధ్వర్యంలో శుక్రవా రం నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక పోలీసులు ఎర్రబెల్లిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఆయన ఎర్రవిలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి సభకు క్షమాపణ చెప్పాలంటూ తమను సస్పెండ్ చేయడం అనైతికమన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలను ఆంగ్లో ఇండియన్స్.. ఆంధ్రా ఏజెంట్లు అని వర్ణించి న మంత్రి కేటీఆర్ ముందుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కరె ంట్ కష్టాలకు కేసీఆర్ అసమర్థతే కారణమన్నారు. అప్పుల బాధతో రైతులు చేసుకుంటున్న ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనన్నారు. తెల్లబట్టలు వేసుకున్నోళ్లకు పింఛన్‌లు రావు, రేషన్‌కార్డులు ఇవ్వరాదని జీఓలో పేర్కొనడం దారుణమన్నారు.

ప్రజా సమస్యలపై గట్టిగా నిలదీస్తున్నారనే అక్కసుతో తమ పార్టీ ఎమ్మెల్యేలను  సస్పెండ్ చేశారన్నారు. అయినా తాము పోరాటం ఆపేది లేద ని.. జిల్లాలన్నీ తిరిగి ప్రభుత్వ తీరును ఎండగడతామన్నారు. ఎంపీ కవిత సమగ్ర సర్వేలో రెండు చోట్ల నమోదు చేసుకుందని.. తాము విషయం బయటకు తీయడంతో అధికారులతో చెప్పి ఒక చోట తొలగిం చుకున్నట్లు ఆరోపించారు. ప్రజా సమస్యల పరిష్కా రం.. కేసీఆర్ మొండివైఖరిపై టీడీపీ ఎమ్మెల్యేలందరం శుక్రవారం సాయంత్రం గవర్నర్‌ను కలిసి వి న్నవించనున్నట్లు ఎర్రబెల్లి తెలిపారు.అలాగే  శనివా రం డిల్లీకి వెళ్లి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామ ని, అవసరమైతే ప్రధాన మంత్రి, రాష్ట్రపతిలను కూ డా కలుస్తామన్నారు.  కాగా, ఎర్రబెల్లిపై సెక్షన్ 151 సీఆర్‌పీసీ కింద (ప్రివెంటివ్ అరెస్ట్)  కేసు నమోదు చేసినట్లు ఎస్సై కరుణాకర్ తెలిపారు. అలాగే 30 మందిపె కూడా కేసు నమోదైనట్లు చెప్పారు.
 

మరిన్ని వార్తలు