18న మిర్యాలగూడలో టీడీపీ మినీమహానాడు

13 May, 2018 07:32 IST|Sakshi
మాట్లాడుతున్న రేవూరి ప్రకాశ్‌రెడ్డి

నల్లగొండ రూరల్‌ : మిర్యాలగూడలో ఈనెల 18న టీడీపీ మినీ మహానాడు నిర్వహిస్తున్నట్టు ఆ పార్టీ పొలిట్‌ బ్యూరో సభ్యు డు సభ్యుడు రేవూరి ప్రకాశ్‌రెడ్డి తెలిపారు. శనివారం జిల్లాకేంద్రంలో నల్లగొండ పార్లమెంట్‌స్థాయి మినీ మçహానాడు సన్నద్ధ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమస్యలపై పలు తీర్మానాలు చేశా రు. సభ నిర్వహణకు 11కమిటీలు ఏర్పాటు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సభకు 3వేల మంది నాయకులు, కార్యకర్తలు రానున్నట్టు తెలిపారు.

టీఆర్‌ఎస్‌ హామీలు, సామాజిక న్యాయం, నిరుద్యోగ సమస్య, ఉపాధి అవకాశాలు, సాగునీటి ప్రాజెక్టుల వైపల్యాలపైన, విద్యా, వైద్యరంగం నిర్లక్ష్యంపై మహనాడులో చర్చిస్తామన్నారు. ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుపోవడంలో టీడీపీ గట్టిపోరాటం చేయాలన్నారు. రైతుబంధు పథ కం కింద ఎకరానికి 4వేలు ఇచ్చినా రైతులు టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగానే ఉన్నారని తెలిపారు. ఒకేసారి రుణమాఫీ చేయకపోవడంతో రైతుల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత ఉందన్నారు. టీడీపీకి గల్లీ నుంచి బలమైన కేడర్‌ ఉందని చెప్పారు.

వచ్చే ఎన్నికల్లో సత్తా చాటుతామని చెప్పారు. సమావెశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు యూసుఫ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పెద్దిరెడ్డి రాజు, నియోజకవర్గ ఇన్‌చార్జులు మాదగోని శ్రీనివాస్‌గౌడ్, సాదినేని శ్రీని వాస్‌రావు, కడారి అంజయ్య, చావా కిరణ్మయి, రాంరెడ్డి, బంటు వెంకటేశ్వర్లు, బాబురావునాయక్, అరున్‌కుమార్, మధుసూదన్‌రెడ్డి, రమేశ్‌బాబు, ఎల్‌వీయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు