మైనర్‌ను బలవంతంగా పెళ్లి.. టీచర్‌ సస్పెన్షన్‌

19 May, 2018 06:21 IST|Sakshi
ఇన్‌సెట్‌లో పాఠశాల హెడ్‌మాస్టర్‌ అక్బర్‌

సాక్షి, రంగారెడ్డి జిల్లా :  లైంగిక వేధింపులకు పాల్పడడంతోపాటు బలవంతంగా బాలికను పెళ్లాడిన ఓ కామాంధ టీచర్‌పై వేటు పడింది. పైగా కాపురానికి రావాలని బెదిరింపులకు దిగిన ఆయనను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలూరుకు చెందిన సయ్యద్‌ అక్బర్‌ శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ ప్రాథమికోన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన బాలిక గతంలో ఆయన శిష్యురాలు. ఐదేళ్ల కిందట ఏడో తరగతిలో పాస్‌ చేయిస్తానని ఆమెపై అత్యాచారయత్నం చేశాడు. ప్రస్తుతం పదిహేడేళ్లు ఉన్న ఆ బాలిక ఇంటర్మీడియెట్‌ చదువుతోంది. ఎకనామిక్స్‌లో పాస్‌ చేయిస్తానని మరోసారి మాయమాటలు చెప్పి ఆమెను అపహరించాడు. ఆ బాలికను బలవంతంగా గోల్కొండ కోటకు కారులో తీసుకెళ్లి అక్కడ ఆమెను పెళ్లి చేసుకున్నాడు. 

మెడలో పుసుపుతాడు ఉండటంతో తల్లి గుర్తించి నిలదీయగా కీచక టీచర్‌ నిర్వాకం బయటపడింది. అంతేగాక తనను పెళ్లి చేసుకున్నానని, కాపురానికి రావాలంటూ ఫోన్‌లో బెదిరింపులకు దిగాడు. ఈ సంభాషణ కూడా సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా టీచర్‌ అక్బర్‌పై శుక్రవారం శంషాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. అక్బర్‌ను సస్పెండ్‌ చేస్తూ డీఈఓ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గ్రహణం రోజున ఆ ఆలయం తెరిచే ఉంటుంది

టిక్‌ టాక్‌ వీడియోలు.. వారిని సస్పెండ్‌ చేయలేదు!

గాలిలో విమానం చక్కర్లు.. భయభ్రాంతులు

చందానగర్ పీఎస్‌ను ఆదర్శంగా తీసుకోండి

150 మంది చిన్నారులకు విముక్తి​

ప్రేమ పేరుతో వేధింపులు.. బాలిక ఆత్మహత్య

‘రాష్ట్రంలో బీజేపీని అడ్డుకునేది మేమే’’

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

ఏటీఎం దొంగలు దొరికారు 

హైదరాబాద్‌ చరిత్రలో తొలిసారి...

చిన్నారిపై లైంగిక దాడి 

తండ్రిని చంపింది పెద్ద కొడుకే..

‘గురుకులం’ ఖాళీ!

ఈ ఉపాధ్యాయుడు అందరికీ ఆదర్శవంతుడు 

‘ఎస్‌ఐ రేణుక భూమి వద్దకు వెళ్లకుండా బెదిరిస్తుంది’

గురుకుల విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

చాలా మంది టచ్‌లో ఉన్నారు..

‘ఆలంబాగ్‌’ ఏమైనట్టు!

ఇంటికే మొక్క

‘క్యాష్‌లెస్‌’ సేవలు

కాంగ్రెస్‌ టు బీజేపీ.. వయా టీడీపీ, టీఆర్‌ఎస్‌

ప్రియుడి చేత భర్తను చంపించిన భార్య

పరిమళించిన మానవత్వం

ఆశల పల్లకిలో ‘కొత్తపల్లి’

ఒకే రోజులో ట్రిపుల్‌ సెంచరీ

ట్రిబుల్‌..ట్రబుల్‌

పెబ్బేరులో మాయలేడి..!

వైఎంసీఏలో ఫుడ్‌ పాయిజన్‌

పూడ్చిన శవాలను కాల్చేందుకు యత్నం 

పల్లె కన్నీరుపెడుతుందో..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మూడు నెలల అనంతరం రిజెక్ట్‌ చేశారు..

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం