కళ్లు చెబుతాయ్‌.. చేతివేళ్లు రాస్తాయ్‌

25 Jul, 2019 08:19 IST|Sakshi
నేత్రవదాన విద్యను ప్రదర్శిస్తున్న విద్యార్థులు

వినూత్న విద్యను నేర్పిన తెలుగు ఉపాధ్యాయుడు హన్మంతు 

ఖమ్మం విద్యార్థులను ప్రేరణగా తీసుకొని అమలు 

నెలరోజుల్లోనే విద్యలో ఆరితేరిన బాలికలు 

పలువురి ప్రశంసలు అందుకుంటున్న విద్యార్థినులు

కోస్గి (కొడంగల్‌): అందరికీ తెలిసి ఎక్కడైన మనుషులు నోటితోనే మాట్లాడతారు. కానీ కోస్గి మున్సిపాలిటీ విలీన గ్రామం పోతిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో విద్యార్థుల కళ్లు, చేతి వేళ్లు మాట్లాడతాయి. కళ్లు, చేతి వేళ్లు మాట్లాడటం ఏమిటని ఆశ్చర్యపోతున్నారా..? మీరు నమ్మిన, నమ్మకపోయిన ఇది నిజం. పాఠశాలలో తెలుగు పండిత్‌గా పనిచేస్తున్న హన్మంతు ఎలాగైన తన విద్యార్థులకు కొత్త విధానంలో బోధన చేసి ప్రత్యేకతను చాటుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఈ మేరకు గతంలో రాజుల పాలనలో కళ్లతోపాటు చేతివేళ్లతో సైగలు చేసే భాష ఉండేదని పురాణాల్లో ఉండటంతోపాటు గతేడాది ప్రపంచ తెలుగు మహాసభల్లో ఖమ్మం విద్యార్థులు కళ్లతో, చేతి వేళ్లతో సైగల ద్వారా అక్షరాలను, లెక్కలు చేసే విధానం ప్రదర్శించారు. ఇదే ప్రేరణగా తెలుగు ఉపాధ్యాయుడు హన్మంతు తనదైన శైలిలో ఈ భాషను నేర్పేందుకు సిద్ధమై పాఠశాలలో చురుకైన ఇద్దరు విద్యార్థుల్ని ఎన్నుకున్నాడు. రమాదేవి, సంతోష అనే ఇద్దరు విద్యార్థుల్ని ఎంపిక చేసుకొని రోజు విరామ సమయం, భోజన సమయాల్లో నేత్రావదానం, గణితావధానం నేర్పించాడు. మొదట ఒక్కో అక్షరానికి ఒక్కో సైగ, ఒక్కో అంకెకు ఒక్కో చేతి వేళ్ల భంగిమ నేర్పించాడు. నెల రోజుల వ్యవధిలోనే విద్యార్థులు నూతన విద్యలో సంపూర్ణతను సాధించారు.  

మరిన్ని వార్తలు