డీటీఓకు ఉపాధ్యాయ సంఘాల వినతి

23 Mar, 2018 15:24 IST|Sakshi
వినతిపత్రం ఇస్తున్న ఉపాధ్యాయ సంఘాల నాయకులు 

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: ఉపాధ్యాయుల నుంచి సీఎం సహాయనిధికి ఒకరోజు వేతనం విరాళం అంగీకారం తెలిపిన వారి నుంచే మినహాయించాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ ఆధ్వర్యంలో గురువారం జిల్లా ట్రెజరీ అధికారి శ్రీనివాస్‌కు వినతిపత్రం సమర్పించారు. సైనిక సంక్షేమ నిధికి ఏటా నవంబర్‌ నెల వేతనాల నుంచి విరాళం ఇస్తున్నామన్నారు. ఇప్పుడు సైనికుల సంక్షేమ నిధికి అదనంగా అవసరం అని ఎవరూ అడగలేదన్నారు.

ఉపాధ్యాయుల అంగీకారం లేకుండా ఏ ఒక్కరి వేతనంతో కోత విధించరాదని వినతిపత్రంలో కోరారు. టీఎస్‌యూ అధ్యక్ష, కార్యదర్శులు కుమారస్వామి, అశోక్, టీపీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు మల్లికార్జున్, రాంచంద్రారెడ్డి, డీటీఎఫ్‌ అధ్యక్ష, కార్యదర్శులు పి.ఈశ్వర్‌రెడ్డి, కోహెడ చంద్రమౌళి, ఎస్‌జీటీయూ అధ్యక్ష, కార్యదర్శులు  సీహెచ్‌ మాధవ్, ఈ.పోచయ్య, టీపీఎస్‌హెచ్‌ఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు సుభాష్, శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.  

మరిన్ని వార్తలు