పకడ్బందీగా బదిలీల ప్రక్రియ

21 Jun, 2015 02:28 IST|Sakshi

పాఠశాల విద్యా కమిషనర్ చిరంజీవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉపాధ్యాయ హేతుబద్ధీకరణ, బదిలీలు, పదోన్నతుల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని పాఠశాల విద్యా కమిషనర్ టి.చిరంజీవులు అన్ని జిల్లాల విద్యాశాఖాధికారులను ఆదేశించారు. బదిలీల ప్రక్రియ ఏర్పాట్లను ఆయన శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. దరఖాస్తు ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానున్నందున పక్కా ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులకు సూచించారు.

బదిలీ ప్రక్రియలో ప్రధాన పాత్ర పోషించేలా ఐదు బృందాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. బదిలీ దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, అభ్యంతరాల స్వీకరణ, పదోన్నతుల కోసం టీచర్ల తుది సీనియారిటీ జాబితాల పరిశీలన, ఖాళీల వివరాల పరిశీలన  బాధ్యతలను వేర్వేరుగా ఆయా బృందాలకు అప్పగించాలన్నారు. ప్రత్యేక కేటగిరీ, అదనపు పాయింట్లు పొందనున్న టీచర్లు సంబంధిత అధికారుల నుంచి ధ్రువీకరణపత్రాలను సమర్పించాలని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు