నేటి నుంచి టెక్నోజియాన్-14

16 Oct, 2014 03:24 IST|Sakshi

 నిట్ క్యాంపస్ : నిట్ టెక్నోజియాన్‌ను ఈ నెల 17 నుంచి 19వ  వరకు నిర్వహించనున్నామని, ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ వరంగల్ ఇన్‌చార్జ్ డెరైక్టర్ ఎస్.శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బుధవారం నిట్‌లోని ఎంబీఏ సెమినార్ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన టెక్నోజియన్ వివరాలు వెల్లడించారు. గురువారం సాయంత్రం 5.30 గంటలకు నిట్ ఇన్‌స్టిట్యూట్ ఆడిటోరియంలో టెక్నోజియాన్ వేడుకలను ఎల్‌అండ్‌టీ, మెట్రోరైల్ మేనేజింగ్ డెరైక్టర్ గాడ్గిల్ లాంఛనంగా ప్రారంభిస్తారన్నారు.

ఈ టెక్నోజియాన్‌కు దేశం నలుమూలల నుంచి మొత్తం 15,000 మంది విద్యార్థు హాజరయ్యే అవకాశం ఉందన్నారు. ఈ నెల 18న టెక్నోజియాన్‌లో భాగం గా యూఎస్ నుంచి లైవ్ వీడియో కాన్ఫరెన్స్ నిట్ విద్యార్థులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పా రు. మ్యూజికల్ నైట్ షో, డీజే షోతోపాటు పలు సామాజిక అంశాలపై ఈవెంట్లు ఉంటాయన్నారు.

సమావేశంలో నిట్ టెక్నోజియాన్ ఫ్యాకల్టీ అడ్వయిజర్ ప్రొఫెసర్ వెంకటరత్నం, నిట్ స్టూడెంట్స్ వెల్ఫేర్ అసోసియేట్ డీన్ సెల్వరాజ్, నిట్ టెక్నోజియాన్  కోఆర్డినేటర్ వె భవ్, డిప్యూటీ కోఆర్డినేటర్ నమ్రత, టెక్నోజియాన్ ఈవెంట్  కోఆర్డినేటర్ సాయి కల్యాణ్ మాట్లాడారు.
 

మరిన్ని వార్తలు