పోలీసుల మందలింపుతో యువకుడి ఆత్మహత్య 

21 Feb, 2020 03:09 IST|Sakshi

యువతి ఫిర్యాదుతో స్టేషన్‌కు రప్పించిన పోలీసులు

ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని కుటుంబీకుల డిమాండ్‌ 

కోస్గి: పోలీసులు మందలించడంతో ఆందోళనకు గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా కోస్గి మండలం చంద్రవంచకు చెందిన మారుతి (19) డిగ్రీ మధ్యలోనే ఆపి వేసి హైదరాబాద్‌లో పని చేసుకుంటుండేవాడు. అయితే ఏడాదిగా ప్రేమ వ్యవహారం నడిపి తనకు గర్భం రావడానికి కారణమయ్యాడని అదే గ్రామానికి చెందిన ఓ యువతి (22) తన తల్లితో కలసి ఈనెల 17న పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు అతడిని స్టేషన్‌కు రప్పించి ‘అమ్మాయి ని పెళ్లి చేసుకుంటావా.. కేసు పెట్టమంటావా?’అనడంతో భయపడిన మారుతి పెళ్లి చేసుకుంటాన ని అంగీకారపత్రం రాసిచ్చాడు.

మరుసటి రోజే సాయిబాబ మందిరంలో పెళ్లి చేసేందుకు ఎస్‌ఐ నాగరాజు ఏర్పాట్లు చేశారు. చివరి నిమిషంలో మారుతి, తాను మైనర్‌నని.. ఆధార్‌ కార్డులో పుట్టి న తేదీ తప్పుగా నమోదైందని పోలీసులకు తెలిపా డు. దీంతో పాఠశాలలో ఇచ్చిన బోనఫైడ్‌ సర్టిఫికె ట్‌ తీసుకురావాలని ఎస్‌ఐ సూచించడంతో అక్కడినుంచి బయటకు వచ్చిన మారుతి తప్పించుకుని హైదరాబాద్‌కు పారిపోయాడు. ఈ నేపథ్యంలో మారుతిని పోలీసులే వదిలేశారని, ఎలాగైనా అతనితో పెళ్లి చే యాలని యువతి పట్టుబట్టడం తో అతనిపై కేసు నమోదు చేశా రు. ఇది తెలుసుకున్న మారుతి బుధవారం రాత్రి స్వగ్రామాని కి వచ్చి అర్ధరాత్రి ఇంటి సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని చనిపోయాడు. గురువారం ఉదయం అటువైపు వెళ్లిన కొందరు కాలనీవాసులు చూసి కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు.

ఎస్‌ఐ వేధింపుల వల్లే బలవన్మరణం 
ఇదిలా ఉండగా ఎస్‌ఐ భయపెట్టడం వల్లే మారుతి ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని తండ్రి అంజిలయ్య, సోదరుడు రవి ఆరోపించారు.ఎస్‌ఐ వచ్చే దాకా తీసేదిలేందటూ మృతదేహం వద్దే బైఠాయించారు. దీంతో కోస్గి సీఐ ప్రేమ్‌కుమార్‌ బాధితులతో మాట్లాడి సమగ్ర విచారణ జరిగిపి బా ధ్యులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఎస్‌ఐ నాగ రాజును వివరణ కోరగా, యువతి ఫిర్యాదు మేరకు మారుతిని పిలిపించి విచారించిన మాట వాస్తవమేనన్నారు. అతను మైనర్‌ను కాబట్టి ఏడాది తర్వాత పెళ్లి చేసుకుంటానని చెప్పడంతోపాటు అమ్మాయి కుటుంబ సభ్యుల ఎదుటే లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చాడన్నారు.

మరిన్ని వార్తలు