సమగ్ర గ్రామీణాభివృద్ధిలో తెల్లాపూర్‌ టాప్‌

23 Dec, 2017 02:30 IST|Sakshi

జాతీయ స్థాయిలో 100కు 92 మార్కులు

టాప్‌ 10లో తెలంగాణ గ్రామాలు ఐదు

కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ బేస్‌లైన్‌ సర్వేలో వెల్లడి

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సమగ్ర గ్రామాభివృద్ధిలో జాతీయస్థాయిలో తెలం గాణలోని తెల్లాపూర్‌ మొదటి ర్యాంకు సాధిం చింది. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం మండలంలోని తెల్లపూర్‌ కేంద్ర గ్రామీణ మంత్రిత్వ శాఖ నిర్వహించిన బేస్‌లైన్‌ సర్వేలో వందకు 92 మార్కులు సాధించింది.  ‘అంత్యోదయ’ పథకం కింద పేదరికం లేని, సమగ్ర అభివృద్ధి సాధించిన గ్రామ పంచా యతీలకు ర్యాంకులు ఇచ్చేందుకు దేశ వ్యా ప్తంగా 41,617 గ్రామ పంచాయితీల్లో ‘బేస్‌ లైన్‌ సర్వే’ నిర్వహిం చింది.  తొలి విడతలో ఒకటి నుంచి 10 ర్యాం కులు సాధించిన 83 పంచాయతీల జాబితాను వెల్లడించింది.

ఇం దులో తెలంగాణలోని తెల్లాపూర్‌ పంచాయతీ జాతీయ స్థాయిలో ఒక టో ర్యాంకు పొందింది. వ్యవసాయం, అక్షరాస్యత, ఆర్థిక వనరు లతోపాటు మౌలిక వసతులలో దశాబ్ధాల క్రితమే అభివృద్ధి చెం దిన కోస్తా తీరం పరిధిలోని 33 గ్రామాలతో ఆంధ్రప్రదేశ్‌కు జాతీయస్థాయిలో మొదటి స్థానం దక్కింది. 10 ర్యాంకులు పొందిన 83 గ్రామాల్లో 33 గ్రామాలు కోస్తా తీరానికి చెందినవే కావడం గమనార్హం.  అభివృద్ధిలో అగ్రగామిగా ఉన్న గుజరాత్‌ చెందిన ఒక్క గ్రామానికి కూడా తొలి పది ర్యాంకుల్లో చోటు దక్కలేదు. వ్యవ సాయంలో అగ్రగామిగా పేరు న్న పంజాబ్‌లో ఐదు, హర్యానా, బీహార్‌లోని వంటి రాష్ట్రా లకు ఒక్కో గ్రామానికి మాత్రమే ర్యాంకులు వచ్చాయి. వివరాలను మిషన్‌ అంత్యోదయ వెబ్‌ సైట్‌లో అందుబాటులో ఉంచారు.

తెలంగాణలో ఐదు జీపీలు
జాతీయస్థాయి సర్వేలో 10 ర్యాం కుల వరకు సాధించిన గ్రామ పంచాయతీల్లో తెలంగాణ నాలుగో స్థానంలో నిలి చింది. మొదటి స్థానంలో 33 గ్రామ పంచాయ తీలతో ఏపీ ఉండగా, రెండో స్థానంలో 21 జీపీలతో తమిళనాడు నిలిచింది. ఆరు పంచాయతీలతో కేరళ మూడో స్థానం లో, ఐదేసి గ్రామ పంచాయతీలతో తెలంగా ణ నాలుగో స్థానంలో నిలిచింది. తెల్లాపూర్‌ ఒకటో ర్యాంకును కైవసం చేసు కుంటే, 7వ ర్యాంకులో వరంగల్‌ జిల్లాలోని కొనైమాకుల, 8వ ర్యాంకు గడ్డమల్లయ్య గూడ (రంగారెడ్డి), 9వ ర్యాంకులను యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన కొండమడుగు, రంగారెడ్డికి చెందిన చౌదర్‌ పల్లి గ్రామాలు సాధించాయి.

మరిన్ని వార్తలు