సియాచిన్‌లో తెలంగాణ జవాను దుర్మరణం

27 Dec, 2015 12:26 IST|Sakshi

ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ నవ్‌గామ్‌బస్తీకి చెందిన ఓ యువ ఆర్మీ జవాను జమ్మూ కాశ్మీర్‌లోని సియాచిన్ పర్వత ప్రాంతంలో ప్రమాదవశాత్తూ గాయపడి మృతి చెందాడు. వైశాఖ సంతోష్‌కుమార్(29) 9 ఏళ్ల క్రితం ఆర్మీలో జవాన్‌గా చేరాడు.  ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రాంతం సియాచిన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. అయితే, ఈ నెల 24న అతడు కాలు జారి కిందపడడంతో తలకు బలమైన గాయాలయ్యాయి. ఆస్పత్రిలో చేర్చగా అదే రోజు రాత్రి మృతి చెందాడు. అతడి మృతదేహం ఆదివారం నవ్‌గామ్‌బస్తీకి తీసుకురానున్నారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు