'ఇళ్లు లేవు...రావు, గాల్లోకి వదిలేశారు'

11 Mar, 2015 11:55 IST|Sakshi

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ వల్ల ప్రజలకు ఒరిగేదేమీ లేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ వ్యాఖ్యానించారు. బుధవారం అసెంబ్లీ వాయిదా అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చి...అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్...ఇప్పుడు ఆ విషయాన్ని మరిచిపోయిందన్నారు.

ఇళ్లు లేవు...ఇళ్లు రావనేదే టీఆర్ఎస్ సర్కార్ విధానమని ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ధ్వజమెత్తారు. ఇక విద్యారంగానికి వస్తే కేజీ నుంచి పీజీ వరకూ మేథోమధనం తర్వాత చూద్దామంటూ విద్యను గాలికి వదిలేశారని ఆయన మండిపడ్డారు. హామీలను ఎన్నికల ప్రచారానికి మాత్రమే టీఆర్ఎస్ వాడుకుందన్నారు. అలాగే సాగునీటి విషయానికి వస్తే ప్రతి నియోజకవర్గంలోనూ భూమిని సాగులోకి తెస్తామని ఆ విషయాన్నే ప్రభుత్వం మరచిందన్నారు.  అలాగే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన కల్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్లకు ఎంత ఖర్చుచేశారో చెప్పలేనివిధంగా సర్కార్ ఉందన్నారు.

మరిన్ని వార్తలు