కేసీఆర్ కూడా కాంగ్రెస్ వారసత్వమే...

16 Mar, 2015 11:16 IST|Sakshi

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ లాబీలో సోమవారం మంత్రి హరీశ్ రావు, కాంగ్రెస్ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. స్పీకర్ మధుసూదనాచారి టీ విరామం కోసం పది నిమిషాలు వాయిదా వేశారు. అనంతరం ఈ వాగ్వాదం జరిగింది. ముంపు మండలాల  అంశంపై చర్చ సందర్భంగా హరీశ్ రావు  చేసిన తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ సభ్యులు ఈ సందర్భంగా ఒత్తిడి తెచ్చారు. అయితే ఈ అంశంపై కాంగ్రెస్ సభ్యులు ఇంకా పట్టుబట్టడం సరికాదని అన్నారు. అలా అయితే మీకే ఇబ్బంది అంటూ పువ్వాడ అజయ్తో హరీశ్ రావు అనగా, కేసీఆర్ కూడా కాంగ్రెస్ వారసత్వమే అని ...అజయ్ గుర్తు చేశారు.
 

మరిన్ని వార్తలు