పద్దులపై చర్చించాకే ఆమోదం: హరీశ్‌

26 Mar, 2017 02:44 IST|Sakshi
పద్దులపై చర్చించాకే ఆమోదం: హరీశ్‌

సాక్షి, హైదరాబాద్‌: చాలాకాలం తర్వాత పద్దులపై అసెంబ్లీలో పూర్తిస్థాయిలో చర్చించి ఆమోదింప జేసుకున్నామని, ఇది ప్రభుత్వం సాధించిన సానుకూలాంశమని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో పద్దులపై చర్చించకుండానే గిలిటెన్‌ చేసే సంప్రదాయం కొనసాగగా, అందుకు విరుద్ధంగా అన్ని పద్దులపై చర్చించాకే ఆమోదముద్ర వేసినట్లు చెప్పారు.

20 ఏళ్ల తర్వాత స్పీకర్‌ కార్యాలయం, ఐ అండ్‌ పీఆర్‌ వంటి పద్దులపైనా సభలో చర్చ జరగడం శుభపరిణామమన్నారు. శనివారం విలేకరులతో మంత్రి మాట్లాడుతూ.. పద్దులపై మాట్లాడేందుకు సుముఖత వ్యక్తం చేసిన ప్రతీ ఒక్కరికీ అవకాశం లభించిందన్నారు. ఇక మాట్లాడేవారెవరూ లేకపోవడంతో నిర్ణీత సమయానికి ముందే సభను వాయిదా వేయాల్సి వచ్చిందని నవ్వుతూ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు