కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదు: కేసీఆర్‌

22 Sep, 2019 15:46 IST|Sakshi

రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం

తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రంలో కౌలుదారులను గుర్తించే ప్రసక్తే లేదని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్పష్టం చేశారు. రైతుల సంక్షేమం కోసమే తమ ప్రభుత్వం ఉందని.. రైతుల భూమి కాపడుతామని సీఎం అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదివారం అసెంబ్లీలో ‘ద్రవ్య వినిమయ బిల్లు’ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా కొత్త రెవెన్యూ చట్టంపై సీఎం మాట్లాడుతూ.. కౌలుదారులు ఎప్పటికప్పుడు మారుతున్నారని తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో ఇచ్చిన భూపరిహారం.. మహబూబ్‌నగర్‌లో ఎలా ఇస్తామని వివరించారు. రిజిస్ట్రేషన్ విలువ, చట్టం ప్రకారం భూపరిహారం ఇస్తామని ప్రకటించారు. ఆర్థికమాంద్యం ప్రభావం అన్ని రంగాలపై ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ‘ద్రవ్య వినిమయ బిల్లు’ పై ఎంఐఎం ఎమ్మెల్యే ముజాంఖాన్ చర్చ ప్రారంభించిన విషయం తెలిసిందే. పది రోజుల పాటు కొనసాగిన అసెంబ్లీ సమావేశాలలో మూడు బిల్లులతో పాటు ఒక తీర్మానాన్ని సభ్యులు ఆమోదించారు. అనంతరం తెలంగాణ శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది.

మరిన్ని వార్తలు