'చారిత్రక కట్టడాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి'

27 Jun, 2015 14:51 IST|Sakshi
'చారిత్రక కట్టడాలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోండి'

హైదరాబాద్: మెట్రో రైలు నిర్మాణం సందర్భంగా హైదరాబాద్ నగరంలో చారిత్రక కట్టడాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి అధికారులకు సూచించారు. శనివారం ఆయన మెట్రో అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యేల రాకపోకల కోసం అసెంబ్లీ వద్ద మెట్రో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేస్తారా ? అని అధికారులను అడిగారు.

అదే విధంగా మెట్రో నిర్మాణ పనుల వల్ల ఇబ్బందికర పరిస్థితులు రాకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ స్పీకర్ అధికారులను ఆరా తీశారు. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఇప్పటికే అలైన్మెంట్ మార్చినట్టుగా స్పీకర్కు అధికారులు తెలిపారు. అంతేకాకుండా పూర్తి నివేదికతో మరోసారి సమావేశం అవ్వాలని నిర్ణయించినట్టు స్పీకర్ తెలిపారు.

మరిన్ని వార్తలు