బాహుబలి 3 విజయవంతం

16 May, 2019 02:46 IST|Sakshi
మోటార్‌ ఆన్‌ చేస్తున్న ఇంజనీరింగ్‌ అధికారులు

ధర్మారం: తెలంగాణ బాహుబలి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం వద్ద ప్యాకేజీ– 6లో భాగంగా నిర్మించిన సర్జిపూల్‌ మరో అద్భుత ఘట్టానికి వేదిక అయింది. బుధవారం ఒక్కరోజే రెండు (3, 4) మోటార్ల వెట్‌ రన్‌ను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. గత నెల 24న మొదటి మోటార్, 25న రెండో మోటార్‌ను సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్‌ ప్రారంభించారు. రెండు మోటార్ల వెట్‌రన్‌ విజయవంతమైంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాల మేరకు మూడు, నాలుగో మోటార్‌ వెట్‌ రన్‌ను ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ నల్ల వెంకటేశ్వర్లు, సీఎం ఓఎస్డీ దేశ్‌పాండే, నీటి పారుదల శాఖ సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, ఈఈ నూనె శ్రీధర్‌ బుధవారం నిర్వహించారు.  

ఎగిసిపడిన గంగమ్మ 
మోటార్లు ఆన్‌ చేసిన వెంటనే సుమారు 105 మీటర్ల లోతు నుంచి గోదావరి జలాలు ఉపరితలంలోని మేడారం రిజర్వాయర్‌లో ఏర్పాటు చేసిన మూడో సిస్టర్న్‌ ద్వారా ఎగిసి పడ్డాయి. అప్పటి వరకు ఉత్కంఠగా ఎదురు చూసిన అధికారులు గోదావరి పరుగులు చూసి సంబరాలు చేసుకున్నారు. ఎలాంటి అంతరాయం కలుగకుండా వెట్‌రన్‌ విజయవంతం కావటంతో ఇంజనీరింగ్‌ అధికారులు, నవయుగ కంపెనీ ప్రతినిధులు, ట్రాన్స్‌కో అధికారులు ఆనందం వ్యక్తం చేస్తూ జై తెలంగాణ నినాదాలు చేశారు. మిఠాయిలు పంపిణీ చేశారు. అనంతరం సిస్టర్న్‌ల వద్దకు చేరుకుని పూజలు నిర్వహించారు. సుమారు 30 నిమిషాలు వెట్‌రన్‌ నిర్వహించారు.
 సిస్టర్న్‌ ద్వారా ఉబికి వస్తున్న గోదావరి జలాలు 

సాయంత్రం నాలుగో మోటార్‌ 
ఈ క్రమంలోనే నాలుగో మోటార్‌ వెట్‌రన్‌ను కూడా అధికారులు సాయంత్రం విజయవంతంగా నిర్వహించారు. 6:45 గంటలకు ఇంజనీరింగ్‌ అధికారులు మోటార్‌ స్విచ్‌ ఆన్‌చేసి వెట్‌రన్‌ ప్రారంభించారు. ఎలాంటి అంతరాయం లేకుండా నాలుగో మోటార్‌ కూడా 25 నిమిషాలు విజయవంతంగా గోదావరి నీటిని 105 మీటర్ల ఉపరితలంలోని సిస్టర్న్‌ ద్వారా లిఫ్ట్‌ చేయడంతో అధికారులు ఆనందంలో మునిగిపోయారు. రెండు మోటార్లు ఒకే రోజు విజయవంతం కావడంపై ఈఎన్‌సీ నల్ల వెంకటేశ్వర్లు, సాంకేతిక సలహాదారు పెంటారెడ్డి, సీఎం ఓఎస్డీ శ్రీధర్‌దేశ్‌పాండే హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికీ వారు కృతజ్ఞతలు తెలిపారు. 

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సినీ నిర్మాత అల్లు అరవింద్‌ ఔదార్యం

చేవెళ్ల లోక్‌సభ ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తి

‘కార్పొరేట్‌’ గాలం!

‘మిస్సెస్‌ యూనివర్స్‌’ ఫైనల్‌కు సిటీ వనిత

కాలేజీలో మొదలై ఆకాష్‌ అంబానీ పెళ్లి వరకు అతడే..

‘ప్రాంతీయ పార్టీలను భయపెట్టేందుకే..’

అవతరణ వేడుక ఏర్పాట్ల పరిశీలన

చంద్రబాబుది బిల్డప్‌: పొంగులేటి

2న అమరుల ఆకాంక్షల దినం

‘వాస్తవాలకతీతంగా ఎగ్జిట్‌ ఫలితాలు’

23, 24 తేదీల్లో విజయోత్సవాలు

సంస్కరణలకు ఆద్యుడు రాజీవ్‌

మళ్లింపు జలాలపై కేంద్రం హ్యాండ్సప్‌!

డీజిలే అసలు విలన్‌...

పార్ట్‌–బీ భూములకు మోక్షమెప్పుడో?

‘సింగరేణియన్స్‌ హౌస్‌’ నిధుల దుర్వినియోగం

కాంగ్రెస్‌ పార్టీలో కోవర్టులు

రైతులను ముంచడమే లక్ష్యంగా..

కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 

జూన్‌ 8, 9 తేదీల్లో చేపమందు 

‘రూపాయికే అంత్యక్రియలు’ భేష్‌ 

తల్లాడ అడవిలో చిరుత సంచారం 

రాష్ట్ర అప్పులు 1,82,000 కోట్లు

వేతనం ఇస్తేనే ఓటు

రాళ్లలో రాక్షస బల్లి!

అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్‌

తయారీరంగంలో ఇది మన మార్కు!

రవిప్రకాశ్‌ కోసం మూడు బృందాలు 

హైదరాబాద్‌లో భారీ వర్షం..!

చెక్ బౌన్స్ .. రూ.కోటి జరిమానా..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎలా డేటింగ్‌ చేయాలో తెలియదు

అలాంటి అనుభవాలు మాకే లభిస్తాయి : కాజల్‌

పొట్టి చిత్రాల పి.సి.శ్రీరామ్‌

నాది యావరేజ్‌ బ్రెయిన్‌

55 ఏళ్ల సురేశ్‌ ప్రొడక్షన్స్‌.. బేబి లుక్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌