బంద్ ప్రశాంతం

13 Jul, 2014 03:05 IST|Sakshi
బంద్ ప్రశాంతం

 సాక్షిప్రతినిధి, నల్లగొండ : తెలంగాణ జేఏసీ పిలుపు మేరకు శనివారం జిల్లావ్యాప్తంగా చేపట్టిన బంద్ ప్రశాంతంగా ముగి సింది. ఖమ్మం జిల్లాలో పోలవరం వద్ద ముంపునకు గురయ్యే ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేస్తూ పార్లమెంటులో బిల్లు పాస్ చేయడాన్ని వివిధ రాజకీయపార్టీలు తీవ్రంగా ఖండించాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు మండల, పట్టణ కేంద్రాల్లో ధర్నా, రాస్తారోకోలు నిర్వహించాయి. పలుచోట్ల ప్రధానమంత్రి దిష్టిబొమ్మను దహనం చేశాయి. ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయి జనజీవనం స్తంభించింది.
 
   నల్లగొండలో ఆర్టీసీ డిపో ఎదుట తెల్లవారుజామునే టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, జేఏసీ జిల్లా నాయకులు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా పార్టీల నేతలు నంద్యాల నర్సింహారెడ్డి, రసూల్, రేఖల భద్రాద్రి, జేఏసీ చైర్మన్ జి.వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, పెట్రోల్ బంక్‌లను స్వచ్ఛందంగా మూసివేశారు. ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్‌ఐ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో సుభాష్ విగ్రహం వద్ద ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. తిప్పర్తిలో నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు.   చౌటుప్పల్‌లో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ైబైక్ ర్యాలీ నిర్వహించారు. సీపీఎం, సీపీఐ  ఆధ్వర్యంలో హైవేపై నిరసన ప్రదర్శన చేశారు. మునుగోడు, మర్రిగూడ, సంస్థాన్ నారాయణపురం, చండూరులో సీపీఎం,  సీపీఐ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది.
 
 కోదాడ పట్టణంలో టీజేఏసీ, టీఆర్‌ఎస్, సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ పార్టీలు బంద్ నిర్వహించాయి. ఈ సందర్భంగా పట్టణంలోని దుకాణాలు, వాణిజ్య సంస్థలు, పాఠశాలలు, కళాశాలలు మూతపడ్డాయి. కోదాడ బస్‌డిపో ఎదుట నాయకులు, కార్యకర్తలు ధర్నా చేశారు. తిరుమలగిరిలో టీఆర్‌ఎస్, సీపీఐ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. శాలిగౌరారం, మోత్కూరులో టీడీపీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, న్యూడెమోక్రసీ, సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో జరిగింది. నూతనకల్, తుంగతుర్తి, అర్వపల్లిలో టీఆర్‌ఎస్, పీడీఎస్‌యూ, న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు.  
 నకిరేకల్‌లో వ్యాపార, వాణి జ్య సంస్థలు తెరుచుకోలేదు.
 
 టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన జరిపారు. సీపీఎం, సీపీఐ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. చిట్యాల, కట్టంగూరు, కేతేపల్లి మండల కేంద్రాల్లో  టీఆర్‌ఎస్, సీపీఎం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. చిట్యాలలో టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిపారు. నార్కట్‌పల్లిలో ఆర్టీసీ బస్ డిపో ఎదుట  టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించిన అనతంరం కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. హాలియా, నిడమనూరు, త్రిపురారం, పెద్దవూర, గుర్రంపోడు, నాగార్జునసాగర్‌లలో టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఎం, సీపీఐ నాయకులు నిరసన ర్యాలీలు, ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.  మిర్యాలగూడ పట్టణంలో బస్టాండ్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌వీ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. దామరచర్ల మండలంలో సీపీఎం ఆధ్వర్యంలో అద్దంకి-నార్కట్‌పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించి మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు.
 
 దేవరకొండ బస్టాండ్ ఎదుట ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆధ్వర్యంలో సీపీఐ నాయకులు ధర్నా నిర్వహించారు. సూర్యాపేటలో టీఆర్‌ఎస్, సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ, జేఏసీల ఆధ్వర్యంలో ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలు ఉదయం నుంచే పట్టణంలో బంద్ చేయించారు. భువనగిరిలో టీఆర్‌ఎస్, సీపీఎం, కాంగ్రెస్, జేఏసీల ఆధ్వర్యంలో బైక్‌ర్యాలీలు, రాస్తారోకోలు చేపట్టారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. బీబీనగర్‌లో బంద్ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను టీఆర్‌ఎస్ నాయకులు దహనం చేశారు. వలిగొండ, పోచంపల్లిలో కాంగ్రెస్ సీపీఎం, టీఆర్‌ఎస్‌ల ఆధ్వర్యంలో బంద్ జరిగింది. అనంతరం ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. హుజూర్‌నగర్, గరిడేపల్లిలలో సీపీఎం, సీపీఐ, మఠంపల్లిలో టీఆర్‌ఎస్, నేరేడుచర్లలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, టీఆర్‌ఎస్, మేళ్లచెరువులో టీఆర్‌ఎస్, సీపీఎం పార్టీల ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై రాస్తారోకో నిర్వహించారు. పోలవరం బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
 కదలని బస్సులు
 నల్లగొండ అర్బన్ : ఖమ్మం జిల్లాలోని పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలపడాన్ని నిరసిస్తూ శనివారం జరిగిన బంద్‌తో మధ్యాహ్నం దాకా ఒక్కబస్సు కూడా డిపోలనుంచి బయటికి రాలేదు. విద్యార్థి సంఘాలు, వామపక్ష పార్టీల నాయకులు, జేఏసీ ప్రతినిధులు తెల్లవారుజామునే డిపోల ఎదుట బైఠాయించి బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో మధ్యాహ్నం 12గంటల వరకు బస్సులు డిపోల గేట్లు దాటలేదు. ఆ తర్వాత  బస్సులను నడిపారు. జిల్లాలోని ఏడు డిపోల్లో మొత్తం 732 బస్సులుండగా రోజూ 685 షెడ్యూల్‌లు నడుస్తాయి. కానీ బంద్ వల్ల 362 రూట్లలో మాత్రమే బస్సులు మధ్యాహ్నం తరువాత నడిపారు. బంద్ వల్ల ప్రయాణికులు రాకపోకలు మానేయడంతో పలు రూట్లలో బస్సులు ఖాళీగా నడిపారు. బంద్ కారణంగా రూ.40లక్షల మేర నష్టం వాటిల్లినట్టు ఆర్టీసీ అధికారులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు