తెలంగాణ బడ్జెట్‌ లైవ్‌ అప్‌డేట్స్‌

9 Sep, 2019 10:38 IST|Sakshi

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్‌) శాసనసభలో ప్రవేశపెట్టారు. 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను సీఎం కేసీఆర్‌ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు.. బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లుగా సీఎం కేసీఆర్‌ చూపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ సెప్టెంబర్‌ 30తో కాలపరిమితి ముగియబోతున్న నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తిస్థాయి వార్షిక చిట్టాపద్దును కేసీఆర్‌ సభ ముందు ఉంచారు. వాస్తవిక దృక్పథంతో ఈసారి బడ్జెట్‌ను రూపొందించామని, రాష్ట్ర బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా నెలకొన్న తీవ్ర ఆర్థిక మాంద్యం ప్రభావం పడిందని సీఎం వివరించారు. దాదాపు 40 నిమిషాల పాటు సీఎం కేసీఆర్‌ బడ్జెట్‌ ప్రసంగాన్ని చదివి వినిపించారు. బడ్జెట్‌ ప్రసంగం ముగిసిన వెంటనే సభను 14వ తేదీ(శనివారం)కి వాయిదా వేస్తున్నట్లు స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రెకటించారు.
తెలంగాణ రాష్ట్ర  వార్షిక బడ్జెట్‌ హైలైట్స్‌.. లైవ్‌ అప్‌డేట్స్‌ ఇవి.. 

ఆయుష్మాన్‌ భారత్‌ కంటే ఆరోగ్య శ్రీతోనే మేలు

  • ఆరోగ్య శ్రీ కోసం ఏడాదికి రూ. 1,336 కోట్లు కేటాయింపు
  • ఆరోగ్యశ్రీ ద్వారా 85 లక్షల 34వేల కుటుంబాలకు ప్రయోజనం
  • ఆయుష్మాన్‌ భారత్‌ ద్వారా కేవలం 26లక్షల కుటుంబాలకు మాత్రమే మేలు
  • పునర్విభజన చట్టం ప్రకారం వెనుకబడిన ప్రాంతాలకు రావాల్సిన రూ. 450 కోట్లను కేంద్రం ఇవ్వలేదు
  • 43 రెవెన్యూ డివిజన్లను 69కి పెంచుకున్నాం
  • 459 మండలాలను 584 మండలాలుగా చేసుకున్నాం
  • గతంలో 68 మున్సిపాలిటీలు ఉంటే వాటి సంఖ్య 142కు పెంచుకున్నాం
  • కొత్తగా ఏడు మున్సిపల్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేసుకొని.. 13కి పెంచుకున్నాం
  • రెవెన్యూ డివిజన్లలో 28 డీఎల్పీవోల సంఖ్యను 68కి పెంచాం

పోలీసు వ్యవస్థ పునర్వ్యవస్థీకరణ

  • రాష్ట్రంలో శాంతి భద్రతల పర్యవేక్షణకు మరింత పటిష్టమైన చర్యలు
  • శాంతిభద్రతలను పటిష్టం చేసేందుకు పోలీసు వ్యవస్థను పునర్వ్యవస్థీకరించాం
  • కొత్తగా ఏడు పోలీసు కమిషనరెట్లను ఏర్పాటుచేసి.. వాటి సంఖ్యను 9కి పెంచాం
  • పోలీసు సబ్‌ డివిజన్ల సంఖ్యను 163కి పెంచాం
  • పోలీసు సర్కిళ్ల సంఖ్యను 668 నుంచి  717కి పెంచాం
  • పోలీసు స్టేషన్ల సంఖ్యను 814కి పెంచాం

అవినీతి రహిత పాలన

  • తెలంగాణలో అవినీతి రహిత పాలన అందిస్తున్నాం
  • కాలం చెల్లిన చట్టాల స్థానంలో కొత్త చట్టాలు తెచ్చాం
  • అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ప్రభుత్వ సేవలు అందిస్తున్నాం
  • పంచాయతీరాజ్‌ శాఖ బలోపేతానికి ఖాళీలను భర్తీ చేస్తాం
  • స్థానిక సంస్థలకు నిధుల కొరత రాకుండా కట్టుదిట్టమైన విధానం 
  • గ్రామపంచాయతీలకు కేంద్రం ఇచ్చే నిధులకు సమానంగా రాష్ట్రం నుంచి నిధులు ఇస్తున్నాం
  • గ్రామపంచాయతీలకు ప్రతినెలా రూ. 339 కోట్లు అందించాలని నిర్ణయం

ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు

  • 2019-20 సంవత్సరానికి రూ. 1, 46,492.3 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌
  • రెవెన్యూ వ్యయం రూ. 1,11,055 కోట్లు
  • మూలధన వ్యయం రూ. 17,274.67 కోట్లు
  • బడ్జెట్‌ అంచనాల్లో మిగులు రూ. 2,044.08 కోట్లు
  • రాష్ట్ర ఆర్థిక లోటు రూ. 24,081.74 కోట్లు

రైతుబంధు, రైతుబీమా నిరంతరం

  • రైతుబంధు, రైతుబీమా పథకాలు నిరంతరం కొనసాగుతాయి
  • పంట రుణ మాఫీ కోసం రూ.6వేల కోట్లు కేటాయిస్తున్నాం
  • రైతుబంధు కోసం 12వేల కోట్లు కేటాయింపు
  • రైతుబీమా ప్రీమియం చెల్లింపు కోసం రూ.1,137కోట్లు కేటాయింపు
  • రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్‌ కోసం ఇప్పటివరకు రూ. 20,925 కోట్లు ఖర్చు

ఐదేళ్లలో అభివృద్ధి, సంక్షేమానికి  5.37 లక్షల కోట్ల ఖర్చు

  • ఉదయ్‌ పథకం ద్వారా రుణభారం రూ. 9,695 కోట్లు ప్రభుత్వమే భరిస్తుంది
  • విద్యుత్‌ సంస్థలకు సింగరేణి చెల్లించాల్సిన బకాయిలు రూ. 5,772 కోట్లు ప్రభుత్వమే చెల్లించింది
  • గ్రామపంచాయతీలకు రూ. 2,714 కోట్లు కేటాయింపు
  • పురపాలక సంఘాలకు రూ. 1,764 కోట్లు కేటాయింపు
  • కొత్త పంచాయతీరాజ్‌, మున్సిపల్‌ చట్టాల ద్వారా గ్రామాలు, పట్టణాల్లో ఉన్నతస్థాయి సేవలు
  • గ్రామాలు, పట్టణాల ప్రగతి కోసం ఈ నెల 6 నుంచి 30 రోజుల ప్రత్యేక కార్యాచరణ
  • ఆసరా పెన్షన్ల కోసం రూ. 9,402 ఓట్లు కేటాయింపు
  • కొత్త జోనల్‌ వ్యవస్థతో స్థానికులకు 95శాతం ఉద్యోగాలు
  • త్వరలోనే 57 ఏళ్లు నిండిన వారందరికీ వృద్ధాప్య పెన్షన్‌
  • బీడీ కార్మికుల పీఎఫ్‌ కటాఫ్‌ డేట్‌ను ప్రభుత్వం తొలగించింది
  • ఇంగ్లిష్‌ మీడియం రెసిడెన్షియల్‌ పాఠశాలలను యథాతథంగా కొనసాగింపు
  • అభివృద్ధి, సంక్షేమం కోసం ఈ ఐదేళ్లలో రూ. 5,37,373 కోట్లు ఖర్చు చేశాం
  • కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు కోసం అందినవి కేవలం రూ. 31,802 కోట్లు మాత్రమే

బకాయిలు చెల్లించాకే కొత్త పనులు

  • ఆర్థిక మాంద్యం వల్ల ఆదాయం తగ్గింది
  • ఆదాయం తగ్గినా పరిస్థితుల్లో మార్పు వస్తుందని ఆశాభావం
  • వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన
  • రానున్న రోజుల్లో పరిస్థితి మెరుగుపడి ఆదాయం పెరుగుతుందని అంచనా
  • బకాయిలు చెల్లించాకే కొత్త పనులు చేపట్టాలని విధాన నిర్ణయం
  • పరిమితులకు లోబడి ప్రభుత్వ మార్గనిర్దేశాల ప్రకారం ఖర్చు
  • నిధుల ఖర్చుపై మంత్రులు, కార్యదర్శులకు ఆర్థిక శాఖ నుంచి స్పష్టమైన సూచనలు

తెలంగాణపైనా ఆర్థిక సంక్షోభ ప్రభావం

  • భీకరమైన జీవన విధ్వంసం నుంచి తెలంగాణ కుదుటపడింది
  • తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రంగాలపై ప్రభావం చూపుతోంది
  • దేశవ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33శాతం తగ్గింది
  • వాహనాల అమ్మకాలు 10.65శాతం తగ్గాయి
  • రూపాయి మారకం విలువ దారుణంగా పడిపోయింది
  • దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభ ప్రభావం తెలంగాణపై కూడా పడింది
  • తెలంగాణకు జీఎస్టీ పరిహారం తీసుకోవాల్సిన అవసరం రాలేదు
  • జూన్‌ నెలలో తీసుకున్న జీఎస్టీ పరిహారం ఏప్రిల్‌, మే నెలల కంటే నాలుగు రెట్లు ఎక్కువ
  • గతంలో ప్రవేశపెట్టిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ అంచనాలకు నేటికీ చాలా వ్యత్యాసముంది
  • కేంద్రానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయంలో 1.36శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది.
  • ఈ ఆర్థిక సంవత్సరం 6.61శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది
  • మొత్తంగా పన్నేతర ఆదాయం 29శాతం తగ్గింది

ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు

  • తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది
  • 2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు ఉండగా.. ప్రస్తుతం రెట్టింపయింది
  • రాష్ట్ర జీఎస్‌డీపీ (రాష్ట్ర స్థూల జాతీయోత్పత్తి) వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది
  • ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయింది
  • వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం
  • నిధులను ఖర్చు చేసే విషయంలో ప్రభుత్వం నిబద్ధతతో ఉంది
  • గత ఐదేళ్లలో పెట్టుబడి వ్యయం ఆరురెట్లు పెరిగింది
  • సమర్థవంతమైన ఆర్థిక విధానం వల్ల అన్ని రంగాలకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందిస్తున్నాం
  • వ్యవసాయ రంగానికి 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్‌ ఇస్తున్నాం
  • రాష్ట్ర రైతాంగం కోసం రైతుబంధు, రైతు బీమా పథకాలను అమలు చేస్తున్నాం
  • రాష్ట్రంలో 6.3శాతం అదనపు వృద్ధి రేటను సాధించాం
  • వ్యవసాయ రంగంలో 2018-19నాటికి 8.1శాతం వృద్ధిరేటును నమోదుచేశాం
  • ఐటీ రంగంలో 2018-19 నాటికి 11.05శాతం వృద్ధిరేటు సాధించాం
  • 2018-19నాటికి లక్షా 10 వేల కోట్ల ఐటీ ఎగుమతులు నమోదయ్యాయి
  • మిషన్‌ కాకతీయ ద్వారా వేలాది చెరువులను పునరుద్ధరించాం
  • వందలాది గురుకులాల్లో లక్షలాది విద్యార్థులకు కార్పొరేట్‌ విద్య అందుతోంది

దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ

  • 2014 జూన్‌లో నూతన రాష్ట్రంగా తెలంగాణ అవతరించింది
  • ఐదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రాష్ట్రం అద్భుతమైన ప్రగతిని సాధించింది
  • దేశంలోనే తెలంగాణ అగ్రగామి రాష్ట్రంగా నిలిచింది
  • వినూత్నమైన పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తోంది
  • రాష్ట్రం ఏర్పడినప్పుడు నిర్దిష్టమైన ప్రతిపాదికలు ఏమీ లేవు
  • తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రం ఆర్థికంగా దృఢంగా మారింది
  • 2013-14లో జీఎస్‌డీపీ విలువ 4,51,581 కోట్లు..
  • రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధిరేటు 4.5శాతం నుంచి 10.2శాతానికి పెరిగింది
  • ఐదేళ్లలో తెలంగాణ సంపద రెట్టింపు అయింది
  • వివిధ ఆర్థిక సంస్థలిచ్చిన నిధులను మూలధన వ్యయంగా ఖర్చు చేశాం
  • రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభం..
  • ప్రముఖ కవి కాళోజీ జయంతి సందర్భంగా అసెంబ్లీ లాంజ్‌లో కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించిన సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి,  సీఎం కేసీఆర్‌, మంత్రులు, ఎమ్మెల్యేలు
  • బడ్జెట్‌ ప్రతులను సభాపతికి అందజేసిన ఆర్థిక మంత్రి హరీశ్‌రావు
     
>
మరిన్ని వార్తలు