-

ప్రైవేటు వర్సిటీలకు జై.. క్యాష్‌లెస్‌కు సై!

11 Dec, 2016 03:43 IST|Sakshi
తెలంగాణ కేబినెట్‌ నిర్ణయాలు

హైదరాబాద్‌: రాష్ట్రంలో ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటుకు తెలంగాణ కేబినెట్‌ పచ్చజెండా ఊపింది. ప్రైవేటు యూనివర్సిటీల ఏర్పాటు విధివిధానాల కోసం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో మంత్రుల సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. శాసనసభ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన శనివారం భేటీ అయిన తెలంగాణ రాష్ట్ర కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

నగదు రహిత లావాదేవీలపై మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన మంత్రుల సబ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇకపై ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహిత విధానంలోనే చేపట్టాలని నిశ్చయించారు. పెద్దనోట్ల రద్దు నేపథ్యంలో నగదు రహిత లావాదేవీల దిశగా ప్రజలను మళ్లించాలని సీఎం కేసీఆర్‌ కేబినెట్‌ భేటీలో పేర్కొన్నారు. ఇక కృష్ణ ట్రిబ్యునల్‌ తీర్పుపై అప్పీల్‌ చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే కొత్త భూసేకరణ చట్టానికి ఆమోదం తెలిపింది. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే బిల్లు సభ ముందుకు రానుంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక అమలు కోసం ఆర్థికశాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటుచేయాలని కేబినెట్‌ నిర్ణయించింది.  
 

మరిన్ని వార్తలు