రేపు కీలకాంశాలపై తెలంగాణ మంత్రివర్గ సమావేశం

18 Dec, 2014 18:43 IST|Sakshi

తెలంగాణ మంత్రివర్గం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సమావేశం కానుంది. ప్రధానంగా పార్లమెంటు కార్యదర్శకుల నియామకంపై తెలంగాణ ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పార్లమెంటు సెక్రటరీల నియామకంలో న్యాయపరమైన చిక్కులు ఉన్నాయి. దీనిపై ఓ కేసు ఇప్పటికే సుప్రీంకోర్టులో పెండింగులో ఉంది.

నలుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటు సెక్రటరీలుగా నియమించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శ్రీనివాసగౌడ్, జలగం వెంకటరావు, వినయ్ భాస్కర్, కోవ లక్ష్మిల పేర్లను కేసీఆర్ ఖరారు చేశారు. అయితే, న్యాయపరమైన చిక్కులు ఉండటంతో దీనిపై తీసుకోవాల్సిన చర్యల మీద శుక్రవారం నాడు కేబినెట్లో చర్చించనున్నారు. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భూ ఆక్రమణల క్రమబద్ధీకరణ మీద కూడా తెలంగాణ కేబినెట్ చర్చించనుంది. కాగా, చీఫ్ విప్గా నియమితులైన కొప్పుల ఈశ్వర్.. శుక్రవారం ఉదయం 11 గంటలకు బాధ్యతలు స్వీకరిస్తారు.

మరిన్ని వార్తలు