నేడే రాష్ట్ర అవతరణ వేడుకలు

2 Jun, 2018 02:21 IST|Sakshi

ఘనంగా ప్రభుత్వ ఏర్పాట్లు

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. పరేడ్‌ గ్రౌండ్స్‌లో అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించనుంది. శనివారం ఉదయం 10.30కు వేడుకలు ప్రారంభమవుతాయి. సీఎం కేసీఆర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీస్‌ గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తారు. తెలంగాణ అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం సీఎం వేడుకల్లో పాల్గొంటారు. అదే సమయంలో అన్ని జిల్లా కేంద్రాల్లోనూ వేడుకలు జరుగుతాయి. జిల్లాలవారీగా మంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్‌తో పాటు సీఎస్‌ వేడుకల్లో పాలుపం చుకుంటారు. రైతు బీమా పథకాన్ని ఈ వేడుకల్లో సీఎం లాంఛనంగా ప్రకటిస్తారు. రైతులందరికీ రూ.5 లక్షల చొప్పున బీమా చేసేందుకు రెండు రోజుల కిందటే ప్రభుత్వం ఎల్‌ఐసీతో ఒప్పందం చేసుకుంది. సాధారణ మరణమైనా, ఇతర కారణమేదైనా రైతులు చనిపోతే వారి కుటుంబీకులను ఆదుకునేందుకు వీలుగా పథకానికి రూపకల్పన చేశారు. మరోవైపు 2,786 వివిధ పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్‌సీ అవతరణ దినోత్సవం రోజే నోటిఫికేషన్లు జారీ చేయనుంది. 

ఏ జిల్లాలో ఎవరెవరు : అవతరణ వేడుకల్లో పతాకావిష్కరణ బాధ్యతలను మంత్రులతో పాటు స్పీకర్, డిప్యూటీ స్పీకర్, ప్రభుత్వ విప్‌లు, సీనియర్‌ ఐఏఎస్‌లకు ప్రభుత్వం అప్పగించింది. సీఎస్‌ వరంగల్‌ వేడుకల్లో పాల్గొననుండటంతో పరేడ్‌ గ్రౌండ్స్‌ వేడుకలకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, డీజీపీ మహేందర్‌రెడ్డి సారథ్యం వహిస్తారు. ఆసిఫాబాద్‌–మండలి చైర్మన్‌ స్వామిగౌడ్, భూపాలపల్లి–స్పీకర్‌ మధుసూదనాచారి, మహబూబాబాద్‌– మంత్రి చందూలాల్, వరంగల్‌ అర్బన్‌–డిప్యూటీ సీఎం కడియం, రంగారెడ్డి– డిప్యూటీ సీఎం మహ మూద్‌ అలీ, మేడ్చల్‌– మంత్రి నాయిని, జనగాం–విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు

రాజన్న సిరిసిల్ల–కేటీఆర్, కరీంనగర్‌–ఈటల, జగిత్యాల–చీఫ్‌ విప్‌ కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి–విప్‌ పాతూరి సుధాకర్‌రెడ్డి, ఆదిలాబాద్‌– జోగు రామన్న, నిర్మల్‌–ఇంద్రకరణ్‌రెడ్డి, మంచిర్యాల–విప్‌ ఓదెలు, సిద్ధిపేట–హరీశ్‌రావు, మెదక్‌–పద్మా దేవేందర్‌రెడ్డి, నిజామాబాద్‌–పోచారం, కామారెడ్డి–విప్‌ గోవర్ధన్, మహబూబ్‌నగర్‌–సి.లక్ష్మారెడ్డి, నాగర్‌ కర్నూల్‌–జూపల్లి, వనపర్తి–ప్లానింగ్‌ బోర్డ్‌ వైస్‌ ఛైర్మన్‌ నిరంజన్‌రెడ్డి, జోగుళాంబ గద్వాల–తలసాని, ఖమ్మం–తుమ్మల, కొత్తగూడెం–పద్మారావు, నల్లగొండ–నేతి విద్యాసాగర్, సూర్యాపేట–జగదీశ్‌రెడ్డి, యాదాద్రి భువనగిరి–విప్‌ సునీత, వికారాబాద్‌–పి.మహేందర్‌రెడ్డి, వరంగల్‌ రూరల్‌–సీఎస్‌ జోషి, సంగారెడ్డి– ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ.

మరిన్ని వార్తలు