‘కేసీఆర్‌ ఢిల్లీ పర్యటనతో ప్రభుత్వానికి సంబంధం లేదు’

1 Nov, 2018 15:26 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రజాస్వామ్యంలో నిఘూ చాలా అవసరమని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి రజత్‌ కుమార్‌ తెలిపారు. తెలంగాణలో ఎన్నికల నిఘాపై ఆయన గురువారం మీడియాతో మాట్లాడుతూ.. అపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యక్తిగతంగా ఢిల్లీ వెళ్లినట్టు తెలిపారు. ఈ పర్యటనతో ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. ఖమ్మంలో బతుకమ్మ చీరల పంపిణీపై వచ్చిన ఫిర్యాదుపై విచారణ చేపట్టినట్టు వెల్లడించారు. ఏపీ పోలీసులు ఇంటెలిజెన్స్‌ కోసమే వచ్చినట్టు ఇరు రాష్ట్రాల డీజీలు నివేదిక ఇచ్చారని తెలిపారు. 

మావోయిస్టు కదలికలపై నిఘూ..
సాక్షి, పెద్దపల్లి: రామగుండం కమిషనరేట్‌ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల పోలీసు అధికారులతో గురువారం రాష్ట్ర డీజీపీ మహేందర్‌రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికలపై సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్టు ఆయన తెలిపారు. మావోయిస్టుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసుకుంటూ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహిస్తామని అన్నారు. ఎన్నికల బందోబస్తుకు కేంద్రం నుంచి అదనపు బలగాలు రాష్ట్రానికి రానున్నుట్టు తెలిపారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని  పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు