జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మెట్రో ప్రారంభం

7 Feb, 2020 16:39 IST|Sakshi

వైఎస్సార్‌ స్నప్వం సాకారమైన వేళ

తొలిదశ మెట్రో రైలు ప్రాజెక్ట్‌ పూర్తి

సాక్షి, హైదరాబాద్‌ : భాగ్యనగర వాసుల మెట్రో కల సంపూర్ణమైంది. హైదరాబాద్‌ మహానగర కీర్తి కిరీటంలో కలికితురాయిగా నిలిచిన మెట్రో రైలు జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో  పరుగులు పెట్టింది. దీంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ప్రారంభించిన యజ్ఞం నేటితో నెరవేరింది. హైదరాబాద్ మెట్రో తొలిదశ ప్రాజెక్ట్‌ పూర్తయ్యింది. 2008 మే 14న అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో నగర మెట్రోప్రాజెక్ట్‌ రూపుదిద్దుకున్న విషయం తెలిసిందే. (హైదరాబాద్ మెట్రో సరికొత్త రికార్డు)

జేబీఎస్‌-ఎంజీబీఎస్‌ మార్గంలో (11 కి.మీ) ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేతలు మీదగా మెట్రో రైళ్లు శుక్రవారం లాంఛనంగా ప్రారంభం అయ్యాయి. సాయంత్రం 4 గంటలకు జేబీఎస్‌ వద్ద ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, పలువురు మంత్రులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ మార్గం పూర్తితో గ్రేటర్‌ నగరంలో 69 కిలోమీటర్ల మెట్రో మార్గం అందుబాటులోకి వచ్చింది. ఈ మెట్రో రైలు మార్గంలో జేబీఎస్‌-పరేడ్‌ గ్రౌండ్స్‌, సికింద్రాబాద్‌ వెస్ట్‌, న్యూ గాంధీ హాస్పటల్‌, ముషీరాబాద్‌, ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌, చిక్కడపల్లి, నారాయణగూడ, సుల్తాన్‌ బజార్‌, ఎంజీబీఎస్‌ మెట్రో స్టేషన్లు ఉంటాయి. ఈ మార్గంలో ఒక చివర నుంచి మరో చివరకు చేరుకునేందుకు 16 నిమిషాలు పట్టనుంది. కాగా ఎల్బీనగర్‌– మియాపూర్, నాగోల్‌–రాయదుర్గం మార్గాల్లో నిత్యం 4 లక్షలమంది రాకపోకలు సాగిస్తున్నారు. (హైదరాబాద్ మెట్రోలోగరుడ వేగసర్వీసులు!)


 

మరిన్ని వార్తలు