'వారిది న్యాయమైన పోరాటం'

21 Jul, 2014 15:16 IST|Sakshi
'వారిది న్యాయమైన పోరాటం'

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులపై లాఠీచార్జ్‌ను కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీలు మధుయాష్కీ, వివేక్‌, రాజయ్య, పొన్నం ప్రభాకర్ ఖండించారు. ఉద్యోగాల కోసం విద్యార్ధుల చేస్తున్నది న్యాయమైన పోరాటమని సమర్థించారు. ఇంటికో ఉద్యోగమన్న హామీని సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఓయూ విద్యార్ధుల పోరాట ఫలితంగానే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చిందన్న వాస్తవాన్ని టీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదని అన్నారు. తమకు ఉద్యోగాలు రావన్న విద్యార్ధుల ఆందోళనపై టీఆర్ఎస్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు.

మరిన్ని వార్తలు