జానా వైఖరిపై పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి

29 Nov, 2014 13:34 IST|Sakshi

హైదరాబాద్ : కాంగ్రెస్ శాసనసభా పక్ష నేత జానారెడ్డిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోనియాగాంధీపై డిప్యూటీ సీఎం రాజయ్య చేసిన వ్యాఖ్యలతో శనివారం అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. దీనిపై సభలో దుమారం రేగింది. ఇంత రాద్ధాంతం జరుగుతున్నా జానారెడ్డి మాత్రం ...సభలోకి రాకుండా తన చాంబర్లోనే ఉండిపోయారు. ఇదే అంశంపై రాజయ్య క్షమాపణ చెప్పాలని డిమాండ్పై కూడా జానారెడ్డి మద్దతు ఇవ్వకపోవడంపై పార్టీ ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. తెలంగాణలో బలిదానాలకు సోనియాగాంధీనే కారణమని రాజయ్య వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

ఈనేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...జానారెడ్డితో భేటీ అయ్యారు. రాజయ్య క్షమాపణ చెప్పాలంటూ టీఆర్ఎస్పై ఒత్తిడి తెచ్చేలా చేయాలంటూ సూచన చేశారు. సోనియా అంశంలో కూడా జానారెడ్డి మెతక వైఖరి అవలంభించటంపై పార్టీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నారు.

మరోవైపు ఈ అంశంపై రాజయ్య మాట్లాడుతూ సోనియాగాంధీ అంటే తనకు గౌరవం ఉందని, అప్పట్లో తనకు అడగకుండానే ఎన్నికల్లో టిక్కెట్ ఇచ్చారని అన్నారు.

మరిన్ని వార్తలు