తెలంగాణ వ్యాప్తంగా దీక్షలు

5 May, 2020 09:37 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్ : పంటల సేకరణ, వ్యవసాయోత్పత్తుల కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రైతు సంక్షేమ దీక్ష చేపట్టనున్నట్టు కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దీక్ష చేపడతామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. అన్ని జిల్లాల డీసీసీ కార్యాలయాల్లో దీక్షలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. దీక్ష సమయంలో కచ్చితంగా భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. కాగా, కరోనా వైరస్‌ కట్టడి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అశాస్త్రీయంగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్‌ పార్టీ సోమవారం గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దృష్టికి తీసుకెళ్లింది.

నేడు టీజేఎస్‌ మౌన దీక్ష
రాష్ట్రంలో కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, ఆకలి, రైతు, వలస కూలీల అవస్థల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా మంగళవారం టీజేఎస్‌ ఆధ్వర్యంలో మౌన నిరసన దీక్ష నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జి.వెంకట్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. పార్టీ కార్యాలయంలో టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం నేతృత్వంలో ఈ దీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో కరోనా కట్టడికి, రైతు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టేలా చూడాలని అఖిలపక్ష నాయకులు సోమవారం రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు. (కరోనా పరీక్షలు.. మరణాల లెక్కలు తేల్చండి)

కేబినెట్‌ భేటీపై ఆసక్తి
ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన తెలంగాణ కేబినెట్‌ ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్‌లో సమావేశం కానుంది. మద్యం దుకాణాల పునరుద్ధరణ, లాక్‌డౌన్‌ సడలింపులపై ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముందని సమాచారం. (తెలంగాణలో మద్యానికి ఓకే!

మరిన్ని వార్తలు