ముగిసిన ‘సహకార’ ఎన్నికల పోలింగ్‌

15 Feb, 2020 08:12 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(ప్యాక్స్‌) ఎన్నికల పోలింగ్‌ ముగిసింది. శనివారం ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్‌ కొనసాగింది. ఏకగ్రీవం కాగా(157 ప్యాక్స్‌లు... 5,403 డైరెక్టర్‌ స్థానాలు) మిగిలిన 747 ప్యాక్స్‌లు, 6,248 వార్డులకు (ప్రాయోజిత నియోజక వర్గాలు) ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ నిర్వహించారు. మొత్తం 14,530 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభిస్తారు. సాయంత్రంలోపు ఫలితాలు ప్రకటిస్తారు. ఇక పోటీ చేసే అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లు వస్తే విజేతను లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తారు. ఆ లాటరీలో ఎంపికైన అభ్యర్థికి మిగిలిన వారికన్నా ఒక్క ఓటు ఎక్కువ వచ్చినట్లు పరిగణించి ఆ అభ్యర్థి ఎన్నికైనట్లుగా ప్రకటిస్తారు.

నారాయణఖేడ్ ఒకటవ ప్రాదేశిక నియోజకవర్గంలో సంగారెడ్డి అనే వ్యక్తి పేరిట ఉన్న ఓటును  మరొకరు వేశారు. ఆరేళ్ల క్రితం చనిపోయిన సంగారెడ్డి ఎలా ఓటు వేస్తారని ఎన్నికల సిబ్బందితో టీఆర్ఎస్ నేతల వాగ్వాదానికి దిగారు. దొంగ ఓట్లు వెయకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

నారాయణఖేడ్ లో ఎన్నికల అధికారులతో 14 వ వార్డు కౌన్సిలర్ నూర్జహాన్ బేగం వాగ్వాదం తన ఓటును వేరే వ్యక్తులు ఎలా వేస్తారని ప్రశ్నించిన కౌన్సిలర్

నల్లగొండ జిల్లా చిట్యాలలో జరుగుతున్న ‘సహకార’ ఎన్నికల్లో ఓ పెళ్లి కొడుకు ఓటు హక్కు వినియోగించుకున్నా. ఉదయం 11.30గంటలకి వివాహ ముహూర్తం ఉండడంతో ఉదయమే వచ్చి ఓటు వేసి వెళ్లిపోయాడు. 

 ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌ సహకార ఎన్నికల పోలింగ్‌ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు రిగ్గింగ్‌ చేస్తున్నారంటూ టీఆర్‌ఎస్‌ నేతల ఆందోళన దిగారు. దీంతో బీజేపీ, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోలీసులు రంగంలోకి దిగి ఘర్షణ అదుపు చేశారు. 

నిజామాబాద్‌ జిల్లాలో సహకార ఎన్నికలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. కోటగిరి, మొస్ర చందూర్‌ మండలాల్లో ఉన్న 5సహకార సంఘాల్లోని 54 డైరెరక్టర్‌ స్థానాలకు ఓటింగ్‌ జరుగుతుంది.

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సహకార సంఘాలు ఉండగా 3 ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 14 సహకార సంఘాలకు ఓటింగ్‌ ప్రారంభమైంది. 220 డైరెక్టర్‌ పదవుల్లో 104 ఏకగ్రీవం కాగా, 116 లకు ఎన్నికలు జరుగుతున్నాయి.

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా 125 సహకార సంఘాలు ఉండగా12 ఏకగ్రీవం అయ్యాయి. 743 డైరక్టర్‌ పదవులు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 113 సహకార సంఘాలకు పోలింగ్‌ ప్రారంభమైంది. 


మరిన్ని వార్తలు