సూర్యాపేటలో సీఎస్‌, డీజీపీ, ఉన్నతాధికారులు

22 Apr, 2020 09:39 IST|Sakshi

కొద్దిరోజులు ఓపిక పడితే సమస్య సద్దుమనుగుతుంది: సీఎస్‌

ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలి

రెడ్‌ జోన్‌  ఏరియాలోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో వైరస్‌ వ్యాప్తి నివారణకు రాష్ట్ర ప్రభుత్వం బహుముఖ వ్యూహం అనురిస్తోంది. కరోనా నియంత్రణ చర్యలు క్షేత్రస్థాయిలో ఎలా అమలు అవుతున్నాయో స్వయంగా పరిశీలించడానికి రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు బుధవారం నుంచి జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు ఆదేశాలతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి శాంత కుమారి, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌ తదితరులు జిల్లాల్లో పర్యటిస్తున్నారు. వీరు స్యూరాపేట, గద్వాల, వికారాబాద్‌ జిల్లాల్లో పర్యటించి, స్వయంగా పరిశీలన చేయనున్నారు. (క్వారంటైన్లో ఉన్నా గైర్హాజరట!)

మార్కెట్ బజార్‌ లో  సీఎస్, డీజీపీ పర్యటన
ముందుగా ప్రత్యేక హెలికాప్టర్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులు సూర్యాపేట చేరుకున్నారు.ఇందులో భాగంగా సూర్యాపేటపట్టణంలోని కరోనా వ్యాప్తి చెందిన కంటోన్మెంట్ ప్రాంతాలైన కూరగాయల మార్కెట్‌ను సీఎస్ సోమేష్ కుమార్... డీజీపీ మహేందర్ రెడ్డి, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతకుమారి. జిల్లా కలెక్టర్ వినయ్ కుమార్ రెడ్డితో కలిసి ఆ ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. కరోనా ఏ విధంగా వ్యాప్తి చెందింది మ్యాప్ రూపంలో అధికారులకు మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది తెలిపారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ... ప్రజలు ఆందోళన చెందవద్దని, కొద్దిరోజుల్లో పరిస్థితి అదుపులోకి వస్తుందని అన్నారు. కరోనా వ్యాప్తిని నియంత్రించడంలో అధికార యంత్రాంగం సమర్ధవంతంగా పనిచేస్తుందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు సహకరించాలని, రెడ్‌ జోన్‌ ఏరియాలోని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దొని సీఎస్‌ సూచించారు. మీ ప్రాణాలు మీ చేతుల్లోనే ఉన్నాయని, కొద్దిరోజులు ఓపిక పడితే సమస్య సద్దుమణుగుతుందన్నారు. కాగా సూర్యాపేట జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న ఒక్కరోజే జిల్లాలో 26 కేసులు నమోదు కావడంతో పాజిటివ్‌ కేసుల సంఖ్య 80కి చేరింది. ఇప్పటికే జిల్లాలో ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. (మార్కెట్ బజార్అంటే హడల్)

మరిన్ని వార్తలు