తెలంగాణ ఎంసెట్‌ షెడ్యుల్‌ విడుదల

26 Feb, 2018 15:41 IST|Sakshi

రేపు ఎంసెట్‌ నోటిఫికేషన్‌

దరఖాస్తుకు చివరి తేది ఏప్రిల్‌ 4

మే 2 నుంచి ఎగ్జామ్స్‌ 

సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఎంసెట్‌ - 2018 షెడ్యూల్‌ విడుదల అయింది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి సోమవారం ఎంసెట్‌ షెడ్యుల్‌ను విడుదల చేశారు. మే 2నుంచి ఐదు రోజులపాటు ఎంసెట్‌ పరీక్షలు జరగనున్నాయి. మే 2, 3 న అగ్రికల్చరర్‌, ఫార్మాకు సంబంధించి‌, 4,5,7 తేదీల్లో ఇంజరీనింగ్‌ పరీక్షలు నిర్వహిస్తారు. ఎంసెట్‌ దరఖాస్తుకు  ఏప్రిల్‌ 4 చివరి తేదీ. అపరాద రుసుముతో ఏప్రిల్‌ 28వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.  అభ్యర్థులు ఏప్రిల్‌ 6 నుంచి 9 వరకు దరఖాస్తుల్లో తప్పులుంటే  సవరణ చేసుకోవచ్చు.  ఏప్రిల్‌ 20 నుంచి మే 1 వరకు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. తెలంగాణలో 10, ఏపీలో నాలుగు సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. 

మరిన్ని వార్తలు